బీజేపీ కి ఒంటరీగా గెలిచే దమ్ము లేదు : బోండా 

బీజేపీ కి ఒంటరీగా గెలిచే దమ్ము లేదు : బోండా 
February 17 17:53 2018
విజయవాడ,
టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు.  ఏపీకి కేంద్రం సాయంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని ఆయన అన్నారు. బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదన్నారు. 2009లో లోక్సభకు సోము వీర్రాజు పోటీచేస్తే 7 వేల ఓట్లే వచ్చాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భవిష్యత్లో బీజేపీ ఎదుగుతుందని అనుకోవడం వాళ్ల అత్యాశేనని బోండా ఉమా వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు ఒంటరిగా రాజమండ్రిలో పోటీ చేస్తే కౌన్సిలర్గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే 15 లక్షల ఓట్లకు కేవలం 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయని బోండా ఉమా గుర్తు చేశారు. ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు రూ.24 వేల కోట్లకు గాను… 1050 కోట్లు ఇచ్చారని చెప్పారు. అమరావతికి రైతులు రూ.50 వేల కోట్ల విలువైన భూములు ఇస్తే.. కేంద్రం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చిందని బోండా ఉమ చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు బుదేల్ ఖండ్, కలహాండి ప్యాకేజీ తరహాలో ఇస్తామన్నారని అవన్నీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు.  రాష్ట్ర రాజధానికి  బీజేపీ రూ.1500కోట్లు ఇచ్చిందని బోండా ఉమా అన్నారు. వాటితో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత ఎజెండాతోనే సోము వీర్రాజు పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ…టీడీపీని మోసం చేసిందని అయిదు కోట్ల ప్రజలు అంటున్నారని, వారికి సోము వీర్రాజు సమాధానం చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17894
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author