వరుస మోసాలతో బ్యాంకింగ్ వ్యవస్ధ 

వరుస మోసాలతో  బ్యాంకింగ్ వ్యవస్ధ 
February 19 12:02 2018
(విశ్లేషణ)
బ్యాంకులు కార్పొరేట్ల చేతుల్లో ఎలా మోసపోతున్నాయి? గ్యారంటీలు లేకుండా అప్పులు ఎందుకిస్తున్నాయి? ఎందుకు నిరర్థక ఆస్తులను మూటకట్టుకుంటున్నాయి?మాల్యా, నీరవ్ మోదీల పరంపర కొనసాగితే బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లి ఈ మొత్తం డిపాజిట్లు హరించుకుపోయే ప్రమాదం ఉన్నది. బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. దీనికి సులువుగా చాలామంది బ్యాంకుల ప్రైవేటీకరణను సూచిస్తున్నారు. ప్రైవేటీకరణతో అన్ని కష్టాలు తీరిపోవు. అప్పుడుండే కష్టాలు అప్పటివే. నష్టాలను జాతీయం చేసి లాభాలను ప్రైవేటీకరణ చేయటం తగదు. దానికన్నా పీఎస్‌బీల అన్నింటిని బహిరంగపరిచేలా చర్యలు చేపట్టాలి.దేశ ఆర్థిక పురోగతి బ్యాంకుల పరిపుష్టిపై ఆధారపడి ఉంటుంది. నిరర్థక ఆస్తులు, రాజకీయ నాయకు ల జోక్యం, అధికారుల అవినీతి, ఉద్దేశపూరిత ఎగవేతలు, బోగస్ ట్రాక్ రికార్డుల వంటి సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకులకు నీరవ్ మోదీ ఒక కొత్త సవాలు విసిరాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగులు అందరూ అంటున్నట్టు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను ఒక గాటిన కట్టలేం. ఈ ఉదంతంలో విజయ్ మాల్యా విష యం వేరు. మాల్యా తన వ్యాపారాల కోసం బ్యాంకుల దగ్గర రూ.9 వేలు అప్పుగా తీసుకొ ని, జల్సాలు చేసి నష్టం వాటిల్లిన క్రమంలో బ్యాంకులకు ఎగనామం పెట్టి పరారయ్యాడు. ఇది ఒక రకమైన మోసం. కానీ నీరవ్ మోదీకి అసలు పెట్టుబడే లేదు. ఇతర దేశాల్లో వ్యాపారం చేసే వ్యాపారస్తుల కోసం ఇక్కడి బ్యాంకులు సమకూర్చే లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అనే అంశాన్ని ఆయుధంగా చేసుకొని, బ్యాంకింగ్‌రంగ రహస్య సంక్షిప్త సమాచార వ్యవస్థ (స్విఫ్ట్) రక్షణ కవచంగా మల్చుకొని పైసా పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసి కోట్లు గడించాడు2011 నుంచి ఇదే తరహా తతంగం నడుస్తుంటే 2017లో ఆలస్యంగా నిద్రలేచిన బ్యాంకు యాజమాన్యం డిప్యూటీ మేనేజర్‌తో సహా 10 మంది ఇతర ఉద్యోగులను విధు ల నుంచి తప్పించింది. అంతకుముందే అసలు ఘనుడు దేశం దాటాడు. ఇప్పటికే అత్యధిక నిరర్ధక ఆస్తులు కలిగిన రెండో బ్యాంక్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కష్టాలు ఎదు ర్కొంటున్నది. ప్రస్తుత నష్టం అంచనా 12 వేల కోట్ల రూపాయలు. మార్కెట్లో ఈ బ్యాంక్ షేర్ విలువ 10 శాతం తగ్గింది. బ్యాంకు అధికారులు చేసిన తప్పులకు బ్యాంకును నమ్మి పెట్టుబడి పెట్టిన మదుపర్లు నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ నగదును డిపాజిట్ చేసిన ఖాతాదారుల గుండెల్లో గుబులు మొదలైందిసామాన్య రైతు రూ॥10,000 కనీస వ్యవసాయానికి అప్పు అడిగితే చుట్టుపక్కల పది బ్యాంకుల నుంచి నిరభ్యంతర ఉత్తరాలు తెమ్మని, చివరిగా మొత్తం భూమిని తనా ఖా పెట్టుకొని మంజూరుచేస్తాయి. ఒక చిన్న వ్యాపారి చెక్‌బౌన్స్ అయితే పదిరకాల రుసు ములు విధించి, ఆపై సిబిల్ స్కోర్‌లో కోతలు పెట్టి మళ్లా అప్పు పుట్టడానికి ఆస్కారం లేకుండా చేస్తాయి. మధ్య తరగతి ప్రజలు కనీస నిల్వలు నిర్వహించలేదని ప్రతి నెలా లక్షలు దండుకుంటాయి బ్యాంకులు. ఈ తరహా ఫైన్ల రూపంలో ఒక్క ఎస్‌బీఐ బ్యాంకే 2016-17 ఆర్థిక సంవత్సరానికి తమ ఖాతాదారుల నుంచి అక్షరాల 17,000 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇదే బ్యాంకు విజయ్‌మాల్యాకు 1200 కోట్ల రూపాయల అప్పును మాఫీచేసింది. కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అంటే ఇదేనేమో.చివరగా వీటినన్నింటిని జనం సొమ్ముతో ఎందుకు రద్దుచేస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరుకాలంటే భారత బ్యాంకింగ్‌రంగ వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలించాలి.1969లో 14 బ్యాంకులను జాతీయం చేసిన ముఖ్య ఉద్దేశం వ్యవసాయానికి అధికంగా పరపతిని అందుబాటులోకి తేవటం. 1990 ఆర్థిక సంస్కరణ ల దరిమిలా పరపతి కూర్పు క్రమంగా వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి మళ్ళింది. అది మొదలు నేటివరకు చిన్నాచితకా వ్యాపారులకు, చెమటోడ్చే రైతులకు బ్యాంకుల వద ఛీత్కారాలు తప్పట్లేవు. బ్యాంకర్ల చూపంతా బడా కార్పొరేట్ సూట్(కేస్)ల వైపే. దేశంలో కేవలం పదిమంది కార్పొరేట్లకు ఇచ్చిన అప్పుతో 6 లక్షల మంది రైతులకు తలా లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వొచ్చంటే కార్పోరేట్ కంపెనీలకు బ్యాంకులు ఏ తరహాలో దాసోహమయ్యాయో చెప్పవచ్చు. బ్యాంకుకు నష్టం వాట్లిల్లితే ఉద్యోగులకు పోయేదేముంది. ప్రభుత్వం ఎప్పటికైనా మూలధన పెట్టుబడి బీమా రూపంలో నిధులు సమకూరుస్తుందన్న ధీమా. అంతకూ కాకపోతే ఖాతాదారుల డిపాజిట్‌లకు కొర్రి విధించవచ్చన్న ధైర్యం. 1990 దశకం మొదట్లో 200 బిలియన్ రూపాయలు బెయిల్ అవుట్‌ను బ్యాంకులు పొందాయి. ఆ తర్వాత సం వత్సరాల్లో సంభవించిన ఆర్థికమాంద్యం కారణంగా మరో 586 బిలియన్ రూపాయలను బెయిలవుట్ రూపంలో పొందాయి. ఇది జాతి సంపద కాదా? ప్రజలు చెల్లించిన పన్నుల్లో నుంచి వచ్చింది కాదా? అంటే ప్రభుత్వాలే అధికారికంగా ప్రజల నుంచి పన్నులరూపంలో వసూలుచేసి బ్యాంకుల రూపం లో కార్పోరేట్లకు కట్టబెడుతున్నాయనేది నగ్నసత్యం. వీటన్నింటిని నియంత్రించాల్సిన అత్యున్నత బ్యాంక్ ఏం చేస్తున్నట్టు. మొత్తం ఉదంతంలో ఆర్‌బీఐ పాత్ర లేకపోలేదు. ఆంగ్ల దినపత్రిక రుణమాఫీలు, బెయిలవుట్ ప్యాకేజీలపై ఆర్‌బీఐని సమాచారం కోరగా ఆ సమాచార సంకలనం ఇంకా రాలేదని తప్పించుకున్నది. జాతీయ బ్యాంకుల నుంచి భారీ అప్పులను ఎగవేసినవారి, ఎగవేసిన సొమ్ము వివరాలను సమర్పించాలని, ఒక ప్రజాహిత వ్యాజ్యం ఆధారంగా, సుప్రీంకోర్టు రిజర్వు బ్యాంక్‌ను ఆదేశించింది. అందుకు సమాధానంగా రిజర్వ్ బ్యాంక్ రూ. 500 కోట్లు ఆపై చిలుకు అప్పులను తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ల పేర్లు, సొమ్ముతో సహా సుప్రీంకోర్టుకు ఒక జాబితాను సమర్పిస్తూ, వాళ్ల పేర్లను రహస్యంగానే ఉంచమని కోరింది. ఎందుకంటే వ్యాపార లావాదేవీలు దెబ్బతింటాయని, వాళ్ల భవిష్యత్ వ్యాపారం పై, రుణాల చెల్లింపులపై తీవ్ర ప్రభావం ఉండగలద ని బ్యాంక్ వాపోయింది. దేశ అత్యున్నత బ్యాంక్ ఎవరి పక్షం వహించింది? ప్రజా ధన సంరక్షణ వైపా? బ్యాంకుల సంక్షేమం వైపా లేక కార్పొరే ట్ దిగ్గజాల సౌఖ్యం వైపా?అంతేగాక అప్పులను సకాలంలో పొందలేని పెట్టుబడిదారుడు వాటిని సత్వరం ఉపయోగించుకోలేకపోవచ్చని, కొందరికి మేనేజ్‌మెంట్ విషయ పరిజ్ఞానం కూడా కొరవడి ఉండవచ్చునని, మరికొందరు ఎంతమంచిగా వ్యాపారం చేసినా ఉత్పత్తి ని పెంచినా అనుకోని పరిస్థితులు ఎదురై నష్టం వాటిల్లి ఉండవచ్చునని రిజర్వ్ బ్యాంకు డిఫాల్టర్స్‌కు వంతపాడుతూ సుప్రీంకోర్టును ప్రాధేయపడే రీతి లో తన అఫిడవిట్‌ను సమర్పించింది.మనది పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకుల్లో ని డిపాజిట్‌లు మొత్తం 96 లక్షల కోట్లు. మాల్యా, నీరవ్ మోదీల పరంపర కొనసాగితే బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లి ఈ మొత్తం డిపాజిట్లు హరించుకుపోయే ప్రమాదం ఉన్నది. బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. దీనికి సులువుగా చాలామంది బ్యాంకుల ప్రైవేటీకరణను సూచిస్తున్నా రు. ప్రైవేటీకరణతో అన్ని కష్టాలు తీరిపోవు. అప్పు డుండే కష్టాలు అప్పటివే. నష్టాలను జాతీయం చేసి లాభాలను ప్రైవేటీకరణ చేయటం తగదు. దానికన్నా పీఎస్‌బీల అన్నింటిని బహిరంగపరిచేలా చర్యలు చేపట్టాలి. గుప్త ఖాతాల నిర్వహణ ఉండకూడదు. అప్పుడు మిగిలిన బ్యాంక్‌లు ఎగవేతదారుల గురిం చి తెలుసుకొని అప్పులు ఇవ్వటంలో జాగ్రత్త వహిస్తాయి. నిరర్ధక ఆస్తులు పెరుగటంలో ఎగవేతదారు ల పాత్రే కాదు. బ్యాంకుల వ్యవహారశైలి కూడా కారణం. బ్యాంకుల వ్యవహారశైలిలో మార్పుల కోసం విధివిధానాలను ప్రకటించి తక్షణం అమలయ్యేలా చూడాలి. ఈ మొత్తం తతంగంలో రాజకీయ నాయకుల జోక్యం ఉండరాదు. బ్యాంకుల మధ్య సమాచార మార్పిడి వ్యవస్థను పటిష్ఠం చేయాలి. మధ్య తరగతి పొదుపు ఖాతాల్లోని కనీస నిల్వలు, ఇతర శాఖల పొదుపులపై ఉండే బ్యాంకుల నిఘా కార్పొరేట్ కంపెనీల కరెంట్ ఖాతాలపై ఎందుకు కొరవడింది. అవసరమైతే బ్యాంకులు పరిమిత సిబ్బంది తో సొంత నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి.
ఆర్‌బీఐ ప్రేక్షక పాత్ర వహించకుండా క్రియాశీలంగా వ్యవహరించాలి. అయినా ఆర్థిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు అమలుచేయాలి. ఇతర దేశాల్లోని నేరస్తుల అప్పగింతకు ద్వైపాక్షిక సంబంధాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. దేశం దాటిన దేశద్రోహుల కోరలు పీకి భవిష్యత్‌లో ఇలాంటి నేరాలకు మరెవ్వరూ పాల్పడకుండా కఠినంగా శిక్షలు విధించాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17949
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author