అన్నింటికి చెడ్డా… రేవంత్ 

అన్నింటికి చెడ్డా… రేవంత్ 
February 19 12:11 2018
హైద్రాబాద్,
అనుకొన్నదక్కటి…. అయినదొక్కటి అంటూ పాట పాడుకుంటున్నారు ఎర్రబెల్లి.తెలంగాణలో సీనియర్ నేత. టీడీపీలో రాజుగా బతికేవాడు. గులాబీ తీర్థం పుచ్చుకుని సైనికుడి కంటే దారుణంగా ఉండాల్సి వస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పుడు కష్ట కాలం దాపురించింది. తన జీవిత కాలంలో ఒక్క సారైనా మంత్రి పదవి రుచి చూడాలని కలలుగంటున్నారు. కానీ కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వడం లేదు. తలసాని, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ ఎర్రబెల్లి విషయంలో వెనక్కుతగ్గారు. చాలా మంది టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు తెర వెనుక పావులు కదిపింది ఎర్రబెల్లినే. అయినా సరే అతన్ని అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ పై విపరీతంగా విమర్శలు చేసేవాడు ఎర్రబెల్లి. కాలం మారింది. ఇప్పుడు అదే కేసీఆర్ కు సలామ్ చేయాల్సి వస్తోంది. ఎర్రబెల్లి కేసీఆర్ లు ఇద్దరు వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలు. కేసీఆర్ కుటుంబంలో హరీష్ రావు, కేటిఆర్ లకు మంత్రి పదవులు వచ్చాయి. ఇక అదే సమాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణా రావు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే నలుగురు ఒకే సామాజిక వర్గం అనే చర్చ సాగుతోంది. అందుకే ఎర్రబెల్లికి అంత తేలికగా మంత్రి పదవి రాదంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి మంత్రి పదవులుఎక్కువగా ఇచ్చుకున్నారనే మాట రాకుండా ఉండేందుకే కేసీఆర్ ఈ అతన్ని పక్కనపెడుతున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. ఆమె గెలిస్తే మంత్రి పదవి ఖాయం. అందుకే తనకు అసలు మంత్రి అయ్యేజాతకం ఉందా లేదా అని జ్యోతిష్యులను అడుగుతున్నారట ఎర్రబెల్లి. ఇటీవల సిఎం కేసీఆర్ తన నియోజకవర్గానికి వచ్చి రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేశారు. కానీ మంత్రి పదవిని దక్కించుకోలేక పోతున్నారు. మోత్కుపల్లి నరసింహులు తన జీవిత కాలంలో గవర్నర్ అవుతారా లేదో గానీ ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇవ్వరు అంటున్నారు. అందుకే దయాకర్ రావు పూర్తి నిరాశలో కూరుకుపోయారంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=17952
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author