సారీ… ఇప్పుడు ఏమి లేవు పీఎంవోకు సీఎంవో సమాధానం

సారీ… ఇప్పుడు ఏమి లేవు పీఎంవోకు సీఎంవో సమాధానం
February 19 16:30 2018
విజయవాడ,
మోదీ మీ రాష్ట్రానికి రావాలనుకుంటున్నారు! ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన, శంకుస్థాపన చేయాల్సిన పథకాలు, ప్రాజెక్టులు ఏవైనా సిద్ధంగా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పండి’’అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పియంఓ ఆఫీస్ వర్తమానం పంపించిన సంగతి తెలిసిందే… ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి క్లారిటీతో ఉంది… ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రావాలని అనుకుంటున్నా.. ఇది తగిన సమయం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది… రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్, సోలార్ పార్కు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ప్రధాని చేతుల మీదుగా నిర్వహించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భావించింది.దీనిపై ప్రధానమంత్రి కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది… అప్పట్లో ఈ విషయం పై కనీసం, స్పందించని పియం ఆఫీస్, ఇప్పుడు స్పందించింది… ప్రధాని రాష్ట్ర పర్యటనకు రావాలని భావిస్తున్నారని, రాష్ట్రంలో ప్రధాని ప్రారంభించే స్థాయి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీసింది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జరిగింది. ఇప్పటికిప్పుడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించే స్థాయి ప్రాజెక్టులేవీ లేకపోవడంతో పాటు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కొంత ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని రాష్ట్ర పర్యటనకు రాకపోతేనే మంచిదన్న భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.ఇదే విషయాన్ని పియం ఆఫీస్ కి కూడా చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది… నిజానికి కర్నూల్ సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతి పెద్దది.. దీని ప్రారంభోత్సవం ఇంకా జరగలేదు…. ఎప్పుడో ప్రధాన మంత్రికి ఈ ప్రారంభోత్సవం చెయ్యాలని చెప్పినా, స్పందించలేదు.. అయితే, ఇప్పుడున్న పరిస్థుతుల్లో, ప్రధాని చేత ఈ సోలార్ పార్క్ ప్రారంభం చేపించటం రాష్ట్రానికి కూడా ఇష్టం లేదనే వార్తలు వస్తున్నాయి… ప్రజల్లో ఆగ్రహం రగులుతున్న సమయంలో రాష్ట్రానికి వస్తామంటున్నారు… ఈయన మళ్ళీ వచ్చి, మట్టి, నీరు ఇచ్చి పొతే, ఈ సారి చంద్రబాబుని కూడా ప్రజలు తిట్టుకునే పరిస్థితి వస్తుంది… అందుకే ముందు విభజన చట్టంలో చెప్పినవి అన్నిటి పై స్పష్టత వచ్చే దాకా, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాని పర్యటన వాయిదా వెయ్యాలని కోరుతోంది… మరి ప్రధాని కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి…
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18010
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author