స‌హ‌జ‌,స‌మ‌తుల‌, ప‌రిమిత ఆహారంతో పరిపూర్ణ ఆరోగ్యం

 స‌హ‌జ‌,స‌మ‌తుల‌, ప‌రిమిత ఆహారంతో పరిపూర్ణ ఆరోగ్యం
February 19 16:36 2018
హైద‌రాబాద్
వేద వేదాంగాలు చెప్పిన‌, మ‌న‌ పూర్వీకులు తీసుకున్న‌, స‌హ‌జ‌, సాత్విక‌, స‌మ‌తుల‌, ప‌రిమిత ఆహారంతోనే మ‌న‌కు మేలు జ‌రుగుతుంద‌ని, పౌష్టికాహార‌మే మ‌న‌ ఆరోగ్యానికి ప‌ది వేలుగా ఉంటుంద‌న్నారు కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ‌పాద్‌ య‌శో నాయ‌క్‌. అలాగే ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం రాష్ట్రంలో అనేక ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయ‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యంతోనే ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ సాధ్య‌మ‌వుతుంద‌న్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. ఈ ఇద్ద‌రు మంత్రులు భార‌త జాతీయ పౌష్టికాహార సంస్థ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర ఆయుష్ భాగ‌స్వామ్యంతో రెండు రోజుల పాటు నిర్వ‌హించిన ప్రాకృతిక ఆహార మేళా ముగింపు స‌మావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా కేంద్ర మంత్రి శ్రీ‌పాద య‌శో నాయ‌క్ మాట్లాడుతూ, మ‌న వేదాలు ఘోషించిన విధంగా సాత్విక ఆహారం తీసుకోవాల‌న్నారు. ఆధునిక ప్ర‌పంచ వేగంలో మ‌న‌మంతా కొట్టుకుపోతున్నామ‌న్న ఆయ‌న‌, అస‌హ‌జ, అసంతులిత ఆహారానికి అల‌వాటు ప‌డ్డామ‌న్నారు. దీంతోనే అనారోగ్యాలు, వ్యాధులు మ‌న బారిన ప‌డుతున్నాయ‌ని చెప్పారు. కిడ్నీ, గుండె, కాలేయం, క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధులు మాన‌వ లోకాన్ని ద‌హించి వేస్తున్నాయ‌న్నారు. వీటన్నింటి నుంచీ విముక్తి ల‌భించాలంటే ఫాస్ట్ ఫుడ్‌ని మానేయాల‌న్నారు. మ‌న పెద్ద‌లు చెప్పిన సేంద్రీయ ఎరువుల‌తో పండించిన పంట‌లు, సాత్విక ఆహారాన్నితీసుకోవాల‌ని మంత్రి ఉద్బోధించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆయుష్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో తాము అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు వివ‌రించారు.రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్ర‌జ‌ల్లో వ్యాధుల ప‌ట్ల అవ‌గాహ‌న, చైత‌న్య కార్య‌క్ర‌మాలు తీసుక వ‌స్తామ‌న్నారు. ఇప్ప‌టికే క్యాన్స‌ర్  స్క్రీనింగ్ వంటి అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌న్నారు. రోగాలు ముదిరాక వైద్యం చేయించ‌క‌డం కాకుండా, అస‌లు రోగాలే రాకుండా ఏం చేయాల‌న్న దాని మీద తెలంగాణ ప్ర‌భుత్వం సీఎం కెసిఆర్ నేతృత్వంలో ప‌ని చేస్తున్న‌ద‌న్నారు. మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారం తీసుకుంటే, మంచి ప‌రిస‌రాలుంటే అంతా మంచే జ‌రుగుతుంద‌న్నారు. అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ఇంటింటికి స్వ‌చ్ఛ‌మైన నీరు 24 గంట‌ల పాటు న‌ల్లాల ద్వారా అందించ‌నుంద‌న్నారు. మిష‌న్ కాక‌తీయ ద్వారా భూగ‌ర్భ జ‌లాల‌ను జ‌నాల‌కు అందిస్తున్న‌ద‌న్నారు. హరిత‌హారం ద్వారా రాష్ట్ర్ర వ్యాప్తంగా మొక్క‌లు నాటి మంచి గాలి, వాతావార‌ణం అందేలా చూస్తున్న‌ద‌న్నారు. మ‌నం తీసుకునే ఆహారం మీద ఒక అవ‌గాహ‌న‌తోనే తీసుకోవాల‌ని మంత్రి సూచించారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వ హ‌యాంలో స‌హ‌జ పౌష్టికాహార ప్ర‌ద‌ర్శ‌న‌ను పెడ‌తామ‌ని మంత్రి చెప్పారు. రెండు రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని నిర్వాహ‌కుల‌ను అభినందించారు. మంత్రులిద్‌రరు ముందుగా పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన స్టాళ్ళ‌ను ప‌రిశీలించారు. కాశ్వీరు నుంచి క‌న్యాకుమారి దాకా, డార్జిలింగ్, త‌మిళ‌నాడు, ఎపీ వంటి ప‌లు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ప్ర‌తినిధులు తమ స్టాళ్ళ‌ను ఏర్పాటు చేశారు. వాటిలో ఆహార ప‌దార్థాల‌ను తీసుకుని మంత్రులు ప‌రిశీలించారు. ఆయా ఆహార ప‌దార్థాల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్ఐఎన్ నిర్వ‌హించిన ప‌లు పోటీల్లో విజేత‌ల‌కు మంత్రులిద్ద‌రూ బ‌హుమ‌తుల ప్ర‌దానం చేశారు. కాగా, ఈ కార్య‌క్ర‌మంలో ఎన్ఐఎన్ డైరెక్ట‌ర్ స‌త్య‌వ‌తి, ఆయుష్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రాజేంద‌ర్‌రెడ్డి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హరి కృష్ణ‌, వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌తినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆయుష్ విభాగం నుంచి డాక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18012
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author