ఫలితం ఇకనుంచి తేలిక..

ఫలితం ఇకనుంచి తేలిక..
February 20 12:05 2018
ఆదిలాబాద్,
రైతులకు అండగా ప్రభుత్వం భూసార పరీక్ష ఫలితాలను ఆన్ లైన్ లోనమోదుచేస్తోంది. ఈ సమాచారంతో రైతులు నేల రకాలకు తగ్గ పంటలు పండించుకుని లాభపడే అవకాశం ఉంది. వాస్తవానికి గతంలో భూసార ఫలితాలు తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. భూసారాన్ని అంచనావేసేందుకు మట్టినమూనాలు సేకరించి జిల్లా కేంద్రానికి పంపించేవారు. నిపుణులు వారు వాటిని విశ్లేషించి, ఫలితం అందించే వరకు సాగు కాలం అయిపోయే పరిస్థితులు ఉండేవి. దీంతో భూసార ఫలితాలపై రైతులు ఆశలు వదిలేసుకున్నారు. ఈ సమస్యను తొలగించేందుకు మట్టినమూనాల ఫలితాలను త్వరితగతిన తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మినీ భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో మండలంలో నాలుగైదు కేంద్రాలు ఉన్నాయి. నమూనాలు సేకరించి, భూసార పరీక్ష కేంద్రాల్లో అందిస్తే వారు మట్టిని పరీక్షించి, భూమిలో ఉండే పోషకాల గురించి చెప్పే ఏర్పాటు ఉంది. మట్టి నమూనాలు ఇచ్చే సమయంలో రైతులకు కోడ్‌ నంబర్‌ కూడా ఇస్తారు. దీని వల్ల ఫలితాల కోసం మళ్లీ కేంద్రానికి వెళ్లే అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఇంటర్నెట్ ద్వారానే సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు.
భూసార పరీక్ష కేంద్రాలు అందుబాటులోనే ఉండడంతో ఏ భూమిలో ఎంత సారం ఉందో తెలుసుకోడానికి రైతులు నెలల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండదిక. ఎక్కడ ఎలాంటి పంటలు పండించాలో ఓ అంచనాకు రావడమే కాక పంటల వారీగా ఎంత మొత్తం ఎరువు వేయాలనేది సులువుగా తెలుసుకోవచ్చు. ఆసక్తి గల రైతులకు తమ భూముల్లో ఉండే సారం తెలుసుకోవాలంటే మట్టి నమూనాలను సేకరించి కేంద్రంలో అందచేస్తే, మూడు రోజుల్లోనే ఫలితాలు చెప్తామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వివరాలను  అంతర్జాలం నుంచే తీసుకునే వీలుందని వివరిస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి నమూనాల ఫలితాలను కార్డుల రూపంలో అందించనుంది. ఉమ్మడి జిల్లాకు ఇప్పటికే విశ్లేషించిన వాటిలో పది వేల కార్డులు చేరుకున్నట్లు సమాచారం. వచ్చే ఖరీఫ్‌ సాగులోగానే రైతులకు తమ భూములకు సంబంధించిన భూసార ఫలితాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీంతో పాటు రైతులకు అందించేందుకు రాష్ట్రస్థాయిలోనే ఫలితాల కార్డులు ముద్రించి పంపిస్తున్నారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని అంతా స్వాగతిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18060
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author