శేఖర్ కమ్ముల చేతులమీదుగా ‘యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్’

శేఖర్ కమ్ముల చేతులమీదుగా ‘యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్’
February 20 19:12 2018
మహేష్ గంగిమళ్ళ వంటి యాక్టింగ్ గురువు మన తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో అవసరం అని ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల అన్నారు. హైదరాబాద్ లోని ఖాజాగూడలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్పిన ‘యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్’ ని ప్రారంభించిన తర్వాత శేఖర్ కమ్ముల.. ఆ సెంటర్ లోని పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. ‘అభినయయోగం’ అనే నూతన ప్రక్రియతో నటన నేర్పుతున్న మహేష్ లో డెడికేషన్, సిన్సియారిటీ అంటే తనకు ఇష్టం అని,  అది నచ్చే ఇక్కడకు వచ్చానని తెలిపారు. మహేష్ శిష్యుల నుంచి నటన రాబట్టుకోవడం దర్శకులకు ఎంతో సులువైన పని అని అన్నారు. తప్పకుండా దేశంలో ఇదో గొప్ప ఇన్స్టిస్టూట్  అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి విద్యార్థులతో తన సినీ అనుభవాలను పంచుకుని, కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. భవిష్యత్ లో తన చిత్రాలకు మహేష్ నాలెడ్జ్ ని ఉపయోగించుకుంటానని శేఖర్ కమ్ముల తెలిపారు.
మహేష్ గంగిమళ్ళ మాట్లాడుతూ.. యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా నటన నేర్చుకోవాలనే వారికి ”అభినయయోగం, అవతార్ కాన్సెప్ట్, లిటిల్ వింగ్స్, లూప్ టెక్నిక్, నౌ యువర్ యాక్టింగ్, యాక్టింగ్ అవెర్నెస్ వర్క్ షాప్స్” ద్వారా నటనలో చక్కని మెళుకువలు నేర్పిస్తామని తెలిపారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18106
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author