మిర్చి మార్కెట్ లో నయా దందా

మిర్చి మార్కెట్ లో నయా దందా
February 21 12:09 2018
ఖమ్మం,
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులుగా మిర్చి పోటెత్తింది. 50,422 బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. ఈ సీజన్‌లో అత్యధికంగా అమ్మకానికి రావడం ఇదే మొదటిసారి. వారం కిందట 45 వేల బస్తాలు రాగా ప్రస్తుతం ఆ మార్క్‌ దాటింది. ప్రతి శనివారం మిర్చి మార్కెట్‌కు సెలవు, ఆదివారం సాధారణ సెలవు కావడంతో మంగళవారం మిర్చి ఎక్కువ మొత్తంలో అమ్మకానికి వచ్చినట్టు వ్యాపారులు భావిస్తున్నారు. కాగా జనవరి చివరి వారంలో క్వింటా మిర్చి ధర రూ.9,300 ఉండగా, ఫిబ్రవరి మొదటి వారంలో రూ.11,200 ఉంది. క్రమేపీ మార్కెట్‌కు సరుకు పెరుగుతోంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ధరను తగ్గిస్తున్నారు. సోమవారం గరిష్ట ధర రూ.9,850 కాగా నమూనా ధర రూ.9,400, కనిష్ట ధర రూ.8200లుగా ఉంది. మార్కెట్‌కు సరుకు ఎక్కువ వస్తున్నందున వ్యాపారులు అడిగిన ధరకే అమ్ముకుని వెనుదిరుగుతున్నట్టు పలువురు రైతులు వాపోతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18137
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author