హస్తినలో ఏపీ పాలిటిక్స్ హీట్…

 హస్తినలో ఏపీ పాలిటిక్స్ హీట్…
February 21 13:14 2018
(విశ్లేషణ)
పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహ న్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో కలకలం రేకెత్తించినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన హామీలలో భాగ మైన ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వని పక్షంలో ఏప్రిల్ 6న తమ పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించాలని ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద హామీలు, వాగ్దానాలను పూర్తిగా విస్మరించడం పట్ల పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఈ నిరసన ఆశించిన స్థాయిలో కేంద్రాన్ని కదిలించలేకపోయింది. అరుణ్ జైట్లీ తన సమాధానంలో గతంలో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. నిజానికి పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనపై చర్చ జరిగినప్పుడుఅప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ,ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను వెనకేసుకొస్తూ గట్టిగా పోరాడారు. అయినప్పటికీ బడ్జెట్‌లో ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చూస్తే ఇక ఎన్‌డీఏ ప్రభుత్వంలో రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం లేదనే అభిప్రా యం బలంగా ఏర్పడుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ గురించే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన కూడా బడ్జెట్‌లో ఎక్కడా కనిపించకపోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలను, రాజకీయ పక్షాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రా ష్ట్రాల్లో కాలుపెట్టాలనుకుంటున్న బీజేపీకి కూడా ఇది తీరని విఘాతం కావచ్చు. బడ్జెట్ రూపకల్పనకు ముందు వివిధ రాష్ట్రాలతో కేంద్ర ఆర్థికమంత్రి జరిపే చర్చల్లో చంద్రబాబు ఆర్థిక మంత్రికి రాష్ట్రావసరాల జాబితాను అందజేశారు. రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూలంకషంగా వివరించా రు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సహాయం, ప్రత్యేక హోదాకు బదులుగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీల గురించి ఆయన ఇతర కేంద్రమంత్రులకు కూడా మరీమరీ చెప్పారు. అయినప్పటికీ బడ్జెట్‌లో ఆ చర్చల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది తమ నాయకుడిని చిన్నచూపు చూడడం తప్ప మరేమీ కాదని, మోదీ కన్నా ముందే జాతీయ రాజకీయాల్లో కేంద్రబిందుైవెన తమ నాయకుని స్థా యిని కించపరుస్తున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నా యి. కేంద్ర బడ్జెట్‌లో ఈ విధైమెన వివక్ష చూపించ డం అనేక రాజకీయ దుష్పరిమాణాలకు దారితీస్తుం దని కూడా టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతుంది.అటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, ఇటు కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు మంజూరు చేస్తోందే తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్రం చివరికి ఆ దిశ లో కూడా పెద్దగా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల రెండు మూడేళ్లుగా తన నిరసనను ఏదోవిధంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం కూడా చంద్రబాబు తమ ఎంపీలతో రాజీనామా చేయిద్దామనుకున్నారు. అయితే, కేంద్రానికి అవకాశం ఇస్తూ పోవడం తప్ప పార్లమెంట్ సభ్యులతో రా జీనామాలు చేయడమనేది జరగనే లేదు. అయితే, చంద్రబాబును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వ్యూహాలు రూపొందించడం లో ఆయన తరువాతే ఎవైరెనా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే మోదీ మంత్రివర్గంలోని తమ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని ఆయన భావిస్తున్నారు. కేంద్రానికి నిరసన తెలియజేసే విషయంలో ఇది మొదటి అడుగని ఆయన ప్రకటించారు. అప్పటికీ ప్రధాని మోదీ తమ కోర్కెలకు స్పందించని పక్షంలో బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ అలయెన్స్ (ఎన్‌డీఏ)లో బీజేపీ, శివసేన తర్వాత ఎంపీల సంఖ్యాపరంగా తెలుగుదేశం పార్టీ అతి పెద్దపార్టీ. 2019లో జరగబోయే లోక్‌సభ ఎన్నిక ల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఇప్పటికే ప్రకటించింది. తెలుగుదేశం నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అగత్యాన్ని పాలక బీజేపీ యే కల్పించినట్టు అర్థమవుతూనే ఉంది. సన్నిహిత వర్గాల ప్రకారం చంద్రబాబు ఇంతకన్నా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోవడం లేదు. హస్తిన మీద పోరాటం జరపడానికి అమరావతే ప్రధాన వేదిక కాబోతోందని ఆయన సన్నిహిత నాయకుడొకరు వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అటు లోక్‌సభకు, ఇటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, బీజేపీ మీద యుద్ధం ప్రకటించడానికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సి న సమయం ఆసన్నైమెందని, అవసరైమెతే బీజేపీయేుతర పార్టీలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కూడా చంద్రబాబు సిద్ధవేునని ఆయన సన్నిహితుడు చెప్పారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు వంటి నిర్ణయం తీసుకునే ముందు ఆయన మరో వ్యూహం గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ అయినా వెనువెంటనే ఇవ్వడానికి నిరసనలతో ఒత్తిడి తెచ్చి ప్రయోజనం లేదని, బీజేపీ మీద ఒత్తిడి తేవడానికి ఇంతకు మించిన వ్యూ హం అవసరమని చంద్ర బాబు భావిస్తున్నారు. పంచాయతీ, మండల సభ్యుల దగ్గర నుంచి కేం ద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా అందరినీ ఢిల్లీ తీసుకు వెళ్లి జంతర్ మంతర్ దగ్గరో, పార్లమెంట్ ముందో ధర్నా చేయించడం కూడా ఇం దులో ప్రధానభాగం. దీనికి శివసేన, తృణమూల్ కాంగ్రెస్, లాలూ ప్రసాద్ పార్టీలతో సహా వివిధ పార్టీల నుంచి క చ్చితంగా మద్దతు లభిస్తుంది. అంతేకాదు, ఇటువంటి కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ మీడియాను కూడా ఆకట్టుకుంటుంది. చివరికి ఇదే తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు నాంది పలుకుతుంది. అవసరైమెతే ఆ తర్వాత ఎంపీలతో రాజీనామా చేయించవ చ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయనగా రాష్ట్రానికి ఇంతవరకూ ఎటువంటి ప్రయోజనమూ కలగకపోవడం చంద్రబాబును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల్లో ప్రజలకు ఏం జవాబు చెప్పాలనే ఆలోచన ఆయనను కలచివేస్తోంది. తాము పార్లమెంట్‌లో కొద్దిపాటి నిరసనలు వ్యక్తం చేసినప్పుడైనా నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని, అవసరైమెన నిధులు సమకూరుస్తామని, విభజన హామీలన్నిటినీ నెరవేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి ఉంటే హుందాగా ఉండేదని, అటువంటి హామీ టీడీపీకే కాక, బీజేపీకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేదని టీడీపీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా, ఎన్‌డీఏ నుంచి వైదొలగగలమని చంద్రబాబు ప్రకటించినా మోదీలో ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా నిర్ణ యం తీసుకోవడం వల్ల చంద్రబాబు అటు రాష్ట్రంలో నూ, ఇటు జాతీయ స్థాయిలోనూ తిరుగులేని నాయకుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. రెండు దశాబ్దాల కిందట ఆయన ఇదేవిధంగా తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు కృషిచేయడం గమనించాల్సిన విషయం. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ఆయన దాదాపు 1996 ప్రాంతంలో కాంగ్రెసేతర, బీజేపీయేుతర పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి కృషిచేశారు. దీనికి కాంగ్రెస్ ఆ తర్వాత బయటి నుంచి మద్దతు ఇచ్చింది. తాము మద్దతునివ్వనంత కాలం బీజేపీ ప్రభుత్వం తమను పట్టించుకోదని ఓ తెలుగుదేశం పార్టీ ఎంపీ వ్యాఖ్యానించారు. 2019లో ఎన్నికలను ఎదుర్కోవాలంటే ప్రత్యేక ప్యాకేజీని, విభజన సమయంలో చేసిన వాగ్దానాలను అస్త్రాలుగా చేసుకుని కేంద్రం మీద గళం ఎత్తక తప్పదని కూడా ఆయన స్పష్టం చేశారు.నిజానికి బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య చాలాకాలం నుంచి వివిధ అంశాలపై వివాదం రాజుకుంటోంది. జనవరి రెండవవారంలో చంద్రబాబు  ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే ముందువరకూ ఈ రెండు పార్టీల మధ్యా స్నేహం సజావుగానే సాగింది. ప్రధానితో సమావేశం జరగడానికి ముందు చంద్రబాబు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తాము తలాక్ బిల్లుకు మద్దతునిచ్చే అవకాశం లేదని ప్రకటించారు. అప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య కొద్దికొద్దిగా విభేదాలు ఉత్పన్నం అయ్యాయి. ఆ తర్వాత జగన్మోహన్‌రెడ్డి ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ, కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే పక్షంలో తాము బీజేపీ ప్రభుత్వానికి మద్దతునివ్వగలమని తెలిపారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లి వచ్చిన తర్వాత, ఆయన జగన్ లేవనెత్తిన అంశం మీదా, దాని పర్యవసానాల మీదా పార్టీ నాయకులతో లోతుగా చర్చించారు. తమతో పొత్తుపట్ల బీజేపీకి ఆసక్తిలేని పక్షంలో తాము బీజేపీ కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించిన తర్వాత నుంచి ఆ యన, ఆయన ఎంపీలు, మంత్రులు కేంద్ర ప్రభుత్వం పై అడపాదడపా విమర్శలు సాగిస్తూనే ఉన్నారు. తమిళనాడులో అటు అన్నాడీఎంకేతోనూ, ఇటు డీఎం కేతోనూ స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే ఇక్కడ కూడా బీజేపీ అటు తెలుగుదేశం పార్టీతోనూ, ఇటు జగన్ పార్టీతోనూ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుందని ఓ తెలుగుదేశం ఎంపీ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రత్యేక ప్యాకేజీని సాధించడానికి తెలుగుదేశం పార్టీ ముందు నాలుగుమార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది-మోదీ ప్రభుత్వం నుంచి తమ మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలను వెనక్కు పిలిపించడం, రెండవది-పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడం, మూడవది-ఢిల్లీలో ప్రతిపక్షాల సహాయ సహకారాలతో భారీయెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, నాలుగవది-ఎన్‌డీయే కూటమి నుం చి వైదొలగడం. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఇందులో ఏదో ఒకటి గానీ, ఇవ న్నీ గానీ జరిగే అవకాశం ఉంది.  కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించిన తర్వాత నుంచి ఆయన, ఆయన ఎంపీలు, మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై అడపాదడపా విమర్శలు సాగిస్తూనే ఉన్నారు. తమిళనాడులో అటు అన్నాడీఎంకేతోనూ, ఇటు డీఎం కేతోనూ స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే ఇక్కడ కూడా బీజేపీ అటు తెలుగుదేశం పార్టీతోనూ, ఇటు జగన్ పార్టీతోనూ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుందని ఓ తెలుగుదేశం ఎంపీ వ్యాఖ్యానించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18152
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author