మార్చి 14న అమరావతిలో జనసేన ప్లీనరీ

మార్చి 14న అమరావతిలో జనసేన ప్లీనరీ
February 21 15:25 2018
విజయవాడ,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఇందుకు అమరావతి వేదిక కానుంది. మార్చి 14న ఈ సభ నిర్వహించనుండటం ఆసక్తికరంగా మారింది. ప్రజారాజ్యం పార్టీ తొలి సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు చిరంజీవి. ఫలితంగా సొంతూరులో ఓడిపోయినా… తిరుపతిలో గెలిచారు చిరంజీవి. ఇప్పుడు అమరావతిలో సభ నిర్వహించడం ద్వారా రానున్న కాలంలో మంగళగిరితో పాటు… మరికొన్ని చోట్ల జనసేన పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయనున్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీలకు సవాల్ విసురుతూ ముందుకు వెళుతున్నాడు పవన్ కల్యాణ్. నాలుగు రోజు టీడీపీ మంచిది అంటాడు. మరో నాలగు రోజులు టీడీపీ వల్ల ఏం కాదంటాడు. కేసీఆర్ ను తిడతాడు. అంతలోనే పొగుడుతాడు. ఒక పద్దతి పాడు అంటూ ఏది లేకుండాపోయింది పవన్ కల్యాణ్ కు. జగన్ కు దమ్ము, ధైర్యం ఉందంటాడు. కానీ ఆయనే అక్రమార్కుడు అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదంటాడు. అతని చర్యలు ఊహాతీతం అనేలా ఉంటున్నాయి.
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయాలని సంకల్పించడంతో జనాలు ఆయన విషయంలో సానుకూలంగానే ఉన్నారు. మిగతా వారు మాటలు చెప్పారు. కానీ పవన్ చేతల ద్వారా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఫలితంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై సానుభూతి ఉంది. నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు వచ్చినా సానుకూలంగానే చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పవన్. అందుకే పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను అన్నిచోట్ల పోటీ చేస్తానని ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కానీ ఆ మాట ప్రకటించిన కొద్ది నిమిషాల్లో ఆయనకు భయం పట్టుకుంది. ఆ కామెంట్ ను తీసేశాడు. ఒక స్టాండ్ అంటూ ఏది లేదు పవన్ కు. అంతా గాలి వాటంలా ఉంటోంది. ఇంకోవైపు పార్టీ సభ్యత్వాన్ని వేగవంతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలోరే చలోరే చల్ పేరుతో రాజకీయ యాత్రలు చేస్తున్నాడు. అధికార పార్టీ మీద ఈగ వాలనీయకుండా చేస్తున్నాడు. ఫలితంగా జనాలతోనే కాదు… విపక్షాల నేతలతోను తిట్లుతింటున్నాడు. తప్పులు జరిగినా ప్రశ్నించలేని అసమర్థతతో ఉన్నాడనే విమర్శలను ఎదుర్కుంటున్నాడు పవన్. ఓటుకు నోటు కేసు, పార్టీ ఫిరాయింపులపై ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడు పవన్. ఒకవేళ వాటిపై మాట్లాడితే అధికార పార్టీ నుంచి ఇబ్బంది వస్తుందని భావిస్తున్నాడు జనసేన నేత. అందుకే మౌనం దాలుస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్లీనరీ సమావేశాలను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జనసేన సిద్దమవుతోంది. పార్టీ పెట్టి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ప్లీనరీ సమావేశాలు జరపలేదు. నేతలను ప్రకటించలేదు. ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లడానికి హడావిడి చేస్తున్నా.. ప్రయోజనం లేదు. గుంటూరు ఆచార్య రంగా యూనివర్సిటీ గ్రౌండ్స్ ను ఈ సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు ఎవరు ఏంటనే విషయాలను ఆ ప్లీనరీలోనే ప్రకటించనుండటం ఉత్కంఠను పెంచుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18164
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author