స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి కేటీఆర్

స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి కేటీఆర్
February 21 16:43 2018
హైదరాబాద్,
రైతులకు ఉపయోగపడేలా సాంకేతికతను తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని హెచ్ఐసీసీలో మూడో రోజు జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ స్టార్టప్ రాష్ట్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. సామాన్యునిపై ప్రభావం చూపని సాంకేతికత వల్ల ఫలితం ఉండదన్నారు. పేదలకు సాంకేతిక ఉపయోగపడితే ఎన్నో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో కాపలాకాస్తున్న సైనికులకు సాంకేతికత ఉపయోగపడాలన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో సాంకేతికతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మౌళిక సదుపాయాల కల్పన ఎంతో ముఖ్యమని అన్నారు. సాంకేతికత పరిజ్ఞానంపై 4.5 బిలియన్ ప్రజలు ఆదార పడ్డారు. విధ్యుత్ నుండి ఆహారం తయారు చేసే పరిజ్ఞానం కూడా వచ్చేసింది. ఈ పరిజ్ఞానం సైనికులకు.. ఎడారుల్లో … స్పేస్ వేళ్ళే వారికి ఆహారం అందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. సాంకేతికతలో మరిన్ని ఇన్నోవేషన్లు అవసరం. మూడువేల పాఠశాల్లో డిజిటల్ క్లాసులు ప్రారంబించాం… గ్రామీణ ప్రాంత విధ్యార్దులకు ఎంతో ఉపయోగ పడుతుందని మంత్రి అన్నారు. 1 0మిలియన్ ఇళ్లకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడమే లక్షంగా పెట్టుకున్నాం. గ్రామాలకు,  స్కూళ్లు,  హాస్పటల్లకు ఇంటర్నెట్ ను 15ఎంబీపీఎస్ స్పీడ్ తో సేవలు అందిస్తామని అయన వెల్లడించారు. వైధ్యరంగంలో టెలీమెడిసిన్ అందుబాటులోకి తీసుకు వచ్చిన రాష్ట్రం తెలంగాణానే. టెక్నాలజీ సహాయంతో మారుమూల గ్రామాలకు కూడా మెరుగైన వైధ్యసేవలు అందిస్తున్నామని కేటీఆర్అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18200
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author