విజయసాయి రెడ్డి పై ఐఏఎస్ సంఘం ఆగ్రహం

విజయసాయి రెడ్డి పై ఐఏఎస్ సంఘం ఆగ్రహం
February 21 17:00 2018
అమరావతి,
సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారని ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అధికారంలోకి వస్తే అనేక మంది ఉద్యోగులు, అధికారులను తరిమితరిమి కొడతామని, శంకరగిరి మాన్యాలు పట్టిస్తామంటూ గతంలోనూ బెదరింపు ధోరణితో మాట్లాడారని విమర్శిచింది. అధికారులను ధూషించడం, వారు మానసిక వేదనకు గురైయ్యేలా విమర్శలు చేయడం తగదని హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు వారి విధి నిర్వహణ రికార్డులు పరిశీలించాలని సూచించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు చెప్పింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18207
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author