క్రిష్ దర్శకత్వంలో “అహం బ్రహ్మాస్మి”

క్రిష్ దర్శకత్వంలో  “అహం బ్రహ్మాస్మి”
February 21 19:58 2018
విలక్షణ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ తెలుగులో గతేడాది “గౌతమిపుత్ర శాతకర్ణి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాక తెలుగువారి చరిత్రను, ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో “మణికర్ణిక” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
“మణికర్ణిక” షూటింగ్ ఆన్ సెట్స్ ఉండగానే.. క్రిష్ తన తదుపరి తెలుగు చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ సైతం మొదలెట్టేశారు. సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం “అహం బ్రహ్మాస్మి” అనే టైటిల్ ను రిజిష్టర్ కూడా చేయించారు.
ఈ చిత్రంలో కథానాయకుడిగా ఒక స్టార్ హీరో నటించనున్నాడు. ప్రస్తుతం సదరు స్టార్ హీరోతో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
“అహం బ్రహ్నాస్మి” భారీ బడ్జెట్ తో, హై టెక్నీకల్ వేల్యూస్ తో రూపొందనుంది. ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతోపాటు నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18216
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author