గ్రేటర్  అధికారుల చేతివాటానికి ఆన్ లైన్  చెక్‌

 గ్రేటర్  అధికారుల చేతివాటానికి ఆన్ లైన్  చెక్‌
February 22 09:31 2018
హైద్రాబాద్,
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు నిలయమైన టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని పూర్తిగా పారద ర్శకంగా రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గ్రేటర్‌ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తయితే.. కొత్త ఇంటికి ఆస్తిపన్ను చెల్లించేందుకు అసెస్‌మెంట్‌ చేయించుకోవడం ఒక ఎత్తు. తాము కొత్తగా ఇల్లు కట్టుకున్నామని, ఆస్తిపన్ను కట్టేందుకు ఇంటి కొలతలు తీసి ఎంత మేర ఆస్తిపన్ను కట్టాలో వెల్లడించాలని, ఆస్తిపన్ను జాబితాలో తమ పేరు నమోదు చేయాలని కోరిన  వారికి  ట్యాక్స్‌ సెక్షన్‌ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేసినా అసెస్‌మెంట్‌కు వెళ్లరు. అసెస్‌మెంట్‌ చేయాలంటే చేయి తడపాలి. అసెస్‌మెంట్‌లో  కట్టాల్సిన  ఆస్తిపన్నుకుంటే ఎక్కువ మొత్తం  పడకుండా ఉండాలంటే ముడుపులు ముట్టజెప్పాలి. అంతేకాదు.. ఇంటి విస్తీర్ణం మేరకు చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తమే చెల్లించేలా అసెస్‌మెంట్‌ చేయమన్నా చేస్తారు. అయితే ఒక కండీషన్‌. వారు కోరినంత భారీ మొత్తాన్ని చెల్లించాలి. మాకు చెల్లించేది ఇప్పుడే కదా.. మీరు ప్రతియేటా చెల్లించే ఆస్తిపన్నులో లాభమేకదా అంటూ అందిన కాడికి దండుకుంటారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమా లపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు బహిరంగంగా పేర్కొన్నారు.  ఢిల్లీ, ముంబయి తరువాత పరిపూర్ణంగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్న నగరం మనదేనని, ఈ విధానం వల్ల దరƒ ఖాస్తుదారులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తు తానికి ఆయా విభాగాల ఎన్‌ఓసీలు దరఖాస్తుదారులే సమర్పించాల్సి ఉంటుం దని ఆయన వివరించారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు గత ఏడాదికాలంగా కమీషనర్‌ జనార్థన్‌రెడ్డి అందివచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. అయి నా కూడా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది ఇళ్ల నిర్మాణ అనుమతులు జారీ చేయడంలో..ఇసీ జారీలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోప ణలు వ్యక్తంకావడంతో ఇక టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చేతివాటకానికి పూర్తిగా స్వస్తిపలికి ఆన్‌లైన్‌ సేవలను అందించాలని కమీషనర్‌ నిర్ణయించారు. ఇందు లో భాగంగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఆన్‌లైన్‌ విధానం పరిపూ ర్ణంగా అమలుకానుంది. ఇంతకాలం వ్యక్తిగత నివాస భవనాలకు మాత్రమే పరి మితమైన ఆన్‌లైన్‌ విధానం ఇక వాణిజ్య, బహుళ అంతస్తులకు కూడా వర్తింపజే శారు. దీంతో టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి నూటికి నూరుశాతం పనులు ఆన్‌లైన్‌ ద్వారానే జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెట్రో నగరాల్లో నూటికి నూరుశాతం ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్న వాటిలో ఢిల్లీ, ముంబ యి తరువాత మన నగరమే కావడం విశేషం. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ లలో  భాగంగా ఈ-ఆఫీసు విధానాన్ని చేపట్టిన జీహెచ్‌ఎంసీ గతేడాది జూన్‌ 2వ తేదీ నుంచి వ్యక్తిగత గృహానిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది విజయవంతంగా కొన సాగుతుండడంతో వాణిజ్య, బహుళ అంతస్తులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇది చేపడితే మొత్తం నూటికి నూరుశాతం టౌన్‌ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ విధానం అమలు చేసినట్లవుతుంది. గత జూన్‌ రెండో తేదీ నుంచి ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా గ్రేటర్‌ పరిధిలో 4,784 భవనాలకు అనుమతులు మంజూరు చేయగా, మరో 1,194 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికా రులు తెలిపారు. అలాగే నిబంధనలకు అనుగుణంగాలేని 128 దరఖాస్తులను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి నిర్మూలన కోసం దరఖాస్తుదారులు అసలు కార్యా లయం మెట్టుకూడా ఎక్కకుండానే ఇంటికే అనుమతులు వచ్చేలా చూడాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే దశలవారీగా మొద లు వ్యక్తిగత గృహాలను చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు తాజాగా అన్ని రకాల భవనాలకూ దీన్ని వర్తింపజేశారు. మలిదశలో ఇతర శాఖల నుంచి ఎన్‌ఓసీలు కూడా పొందే అవసరం లేకుండా సింగిల్‌ విండో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తుల అనుమతుల కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ, ఫైర్‌సేఫ్టీ, రెవె న్యూ, భూ వినియోగం వివరాల కోసం హెచ్‌ఎండీఏ, పర్యావరణ శాఖ తదితర విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. అవి తీసు కున్న తరువాతే జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. దరఖాస్తుదారులు ఇంటి దరఖాస్తుతో పాటు వీటిని కూడా జతచేసి ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అయితే రెవెన్యూ, ఎయిర్‌పోర్టు అథారిటీతో ఇప్పటికే జీహెచ ్‌ఎంసీ అనుసంధానం ఏర్పాటు చేసుకుంది. త్వరలో పర్యావరణం, ఫైర్‌సేఫ్టీ, హెచ్‌ఎండీఏ తదితర శాఖలతో కూడా అనుసంధానం ఏర్పాటు చేసుకుంటే దరఖాస్తుదారులు సింగిల్‌ విండో ద్వారానే దరఖాస్తు చేసుకునే ఆస్కారం కలుగు తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18274
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author