80 కోట్లతో అమరవీరుల స్థూపం

80 కోట్లతో అమరవీరుల స్థూపం
February 22 12:50 2018
 హైద్రాబాద్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని హుస్సేన్సాగర్ దగ్గర ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు..అధికారులకు  ఏర్పాట్లకు సంబంధించిన విషయాల పై మార్గదర్శకాలు జారీచేశారు. పనులను అనుకున్నా దానికంటే ముందుగానే అందరిని ఆకట్టుకునే విధంగా డిసైన్ చేయల‌ని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటులో ప్రాణత్యాగం చేసిన వారి జ్ఞాపకార్థం తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని సంబంధించిన  ఆకృతి కెసిఆర్ కూడా ఆమోదం తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని ఏర్పాటు చేయాలనీ సీఎం అధికారులను ఆదేశించారు..:అలాగే  హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థూపం తో  పాటు సాగర్లో ఉండే బుద్ధుని విగ్రహం, ఆ వెనకవైపు ఒడ్డున ఎగురవేసిన అతిపెద్ద జాతీయ జెండాలు ఒకే రేఖపై కనిపించేలా నిర్మించనున్నారు. స్థూపం ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఓ అందమైన పార్కు, వాటర్ ఫౌంటెన్ తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. పార్కు మధ్యలో మరో పిల్లర్, ఆ పిల్లర్ పై తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా డిజైన్ రూపొందించారు.ఇక ఈ స్థూపానికి సుమారు  80 కోట్ల అంచనాతో నిర్మించే  ఈ అమరవీరులస్థూపం స్ట్రక్చర్ ను ఓసారి పరిశీలిస్తే, అది ప్రమిద ఆకారంలో ఉండే ఓ ఏడంతస్తుల మేడ అనే చెప్పాలి. దాంట్లో కింద సెల్లార్లో 2 ఫ్లోర్లు పార్కింగ్ కోసం కేటాయిస్తారు. దానిపైన గ్రౌండ్ లెవెల్లో సర్వీస్ ఫ్లోర్ ఉంటుంది. కాగా మొదటిది అమరవీరుల అంతస్తు, రెండో అంతస్తును సంస్మరణ సభలు జరుపుకోవడానికి వీలుగా ఉండే కన్వెన్షన్ హాల్ కోసం వినియోగించనున్నారు. మూడో ఫ్లోర్లో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తారు. ఇక వెలుగుతున్న దీపం ఆకారంలో ఉండే ఈ నిర్మాణంలో జ్యోతి ఆకారాన్ని గ్లోసైన్ విద్యుత్ దీపాలతో వెలిగించేందుకు వీలుగా ఫైబర్ మెటీరియల్ ను వాడనున్నారు.ఈమేరకు సంబంధిత నమూనా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని హంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో మార్చి నెల మొదటివారంలో టెండర్లు పిలిచేందుకు అధికారులు కూడా కసరత్తు మొదలుపెట్టారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18298
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author