పెట్టుబడి పథకానికి నగదు సమస్య

పెట్టుబడి పథకానికి నగదు సమస్య
February 22 13:49 2018
హైద్రాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తర్వాత దేశ వ్యాప్తంగా నగదు కష్టాలు ఎక్కువయ్యాయి. నాటి నుంచి నేటి వరకు సామాన్యులు నగదు కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం నగదు కొరత సమస్య రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు తలబొప్పి కట్టిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పెట్టుబడి పథకం’కు నగదు కొరత సమస్యగా మారింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ పథకం ద్వారా అందే పెట్టుబడి రైతులకు సకాలంలో చేరేలా లేదు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడిగా నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు సవుకూర్చుకోవలసి ఉంటుంది. ఒకేసారి అంత పెద్ద మొత్తంలో నగదు సమకూరడం ఎటూ చూసినా సాధ్యపడని విషయంగా కనిపిస్తుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ‘పెట్టుబడి’ పథకానికి సహకారం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా లేదని తెలిసింది. దీంతో మే 15 వరకు రైతులకు నగదు అందడం కష్టమనే చెప్పాలి.పెట్టుబడి నగదు పథకం అమలుకు నిర్ణయం తీసుకున్న నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నగదు కొరతను అధిగిమించడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కూడిన రాష్ట్ర బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్‌బీఐ అధికారులను కలిశారు. పథకం అవులుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి పరిస్థితిని వివరించారు. అంతపెద్ద మొత్తంలో నగదు నిల్వలు సమకూర్చడం కష్టమైన పని అని వారు తేల్చి చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఇటు ప్రభుత్వం, అటు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.ఈ సంవత్సరానికి సంబంధించి దిగుబడి అయిన పంటను అమ్మగా సవుకూరిన డబ్బు చాలామంది రైతుల చేతికి వస్తుంది. ఈ మొత్తంలో కొంత మొత్తాన్ని పంట పెట్టుబడికి, మిగిలిన సొమ్ము అప్పు తీర్చడానికి రైతులు వెచ్చిస్తారు. ఎన్నో ఏళ్లుగా రైతులు అనుసరిస్తున్న విధానం ఇదే. దుక్కి దున్నడం, చదును చేయడం, విత్తనాలు తెచ్చుకోవడం కోసం కావాల్సిన సొమ్మును సిద్ధం చేసి పెట్టుకుంటారు. అసలు రైతులకు డబ్బులకు ఇబ్బంది అయ్యేదల్లా.. జూన్, జూలై నెలల్లోనే. ఆ సమయంలోనే ఎక్కువ మంది రైతులు రుణాల కోసం ప్రయుత్నిస్తుంటారు. ఒక వేళ ప్రభుత్వం మే నెలలో చెక్కులు ఇచ్చినప్పటికీ రైతులు వాటిని జూన్, జూలైలో నగదుగా మార్చుకుంటారు.  అందువల్ల భారమంతా కేంద్రంపై వేయుకుండా, పథకం అవులుకు వేరే మార్గాలు అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచించింది. నగదు కొరత నేపధ్యంలో పెట్టుబడి పథకం ఏ స్థాయిలో సఫలం అవుతుందో, రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందో మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.రైతులకు ముందస్తు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల పట్టా భూమి 70 లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది. వీరందరికి ఎకరాకు రూ.4 వేల చొప్పున మే 1 నుంచి 15వ తేదీ మధ్యలో నగదు అందజేయాలని ప్రభుత్వం భావించింది. రైతులకు నగదు నేరుగా ఇవ్వడం సాధ్యం కాకపోవడంతోపాటు అనేక సవుస్యలు ఏర్పడతాయనే ఉద్దేశంతో పెట్టుబడి సొమ్మును చెక్కు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రావుసభలు నిర్వహించి రోజుకు వెయ్యి గ్రామాల చొప్పున చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే డబ్బు ఎప్పటికీ చేతికి అందుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చెక్కులు, నగదు కావడానికి కనీసం నెల రోజులు పడుతుందని అంటున్నారు. ఇదే జరిగితే పెట్టుబడి పథకం విషయంలో ప్రభుత్వ ఆశయం నీరుగారినట్టే.. ఎందుకంటే.. అప్పటికే వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. సాగుకు కావాల్సిన అవసరాలను రైతులు అప్పటికే సమకూర్చుకుంటారు. మే 15వ తేదీకిచెక్కులు అందినా.. డబ్బులు జూన్ 15కు రైతులకు అందుతాయి. అప్పటికే ఖరీఫ్ పనులు జోరందుకుంటాయి. దీంతో రైతులు సాగు అవసరాల కోసం అప్పులు చేయక తప్పదు. సీఎం కేసీఆర్ ఆర్‌బీఐ అధికారులను కలిసిన సవుయంలో ప్రధానికి కలిస్తే ఫలితం ఉండవచ్చని పలువురు అధికారులు ఆయునకు సూచన చేశారు. అయితే ప్రధానిని కలిస్తే ఏ మేరకు ఉపయోగం ఉంటుందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఒకవేళ ప్రధానిని కలిస్తే రూ.2 వేల కోట్ల వరకు నగదు నిల్వలు అందే అవకాశం ఉందని తెలిసింది. అయితే అవసరమైన నగదుతో పోల్చుకుంటే రెండు వేల కోట్లు ఏమూలకు వస్తాయని ఆందోళన మొదలయ్యింది. అయితే రైతులందరికీ ఒకే తేదీలు కాకుండా వేర్వేరు తేదీలను చెక్కులపై ముద్రించి ఇస్తే కొంతవరకు సవుస్య తీరుతుందని పలువురు అధికారులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళితే.. చెక్కులు ఇచ్చిన వెంటనే రైతులందరూ  బ్యాంకులకు వెళ్లడం కష్టమే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18312
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author