పీపుల్స్ ప్లాజాలో  స్వచ్ఛ ఆటోల పంపిణీ

పీపుల్స్ ప్లాజాలో  స్వచ్ఛ ఆటోల పంపిణీ
February 22 14:28 2018
హైదరాబాద్,
హైదరాబాద్  ఇళ్ల నుంచి చెత్తను రవాణా చేసేందుకు ఉపయోగించేందుకు మరో 150 స్వచ్ఛ ఆటోలను  జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో 150 స్వచ్చ ఆటోలను లబ్దిదారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, మేయర్ బొంతు రాంమోహన్ మరియు కమీషనర్ జనార్దన్ రెడ్డి అందించారు. మేయర్ మాట్లాడుతూ ఇప్పటికే 2000 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేయగా, ఇప్పుడు మరో 150 పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి 500 పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 150వాహనాలు సిద్ధం కావడంతో వాటిని పంపిణీ చేస్తున్నట్లు మేయర్ చెప్పారు. త్వరలోనే మిగిలిన 350 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు, దీనికోసం ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తైనట్లు కమీషనర్  జనార్ధన రెడ్డి తెలిపారు.  ఇప్పటికే రిక్షాలద్వారా చెత్తను తరలిస్తూ ఆటోలు నాలుగు చక్రాల వాహనాలు నడిపే లైసెన్సులు కలిగివున్నవారికి వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కొత్తత ఆటోలను టాటా ఆటో సంస్థ తయారు చేసింది. సరికొత్త హంగులతో తయారుచేసారని అన్నారు. జీపీఎస్,  .మైక్ అనౌక్స్ మెంట్ తడిపొడి చెత్తను వేరుచేసే క్యాబిన్ పార్టిషన్ , పైన కప్పే కవర్  ఇన్ బిల్ట్ ఫిటింగ్ తో తయారు చేసారు. జీపీఎస్ స్వచ్ఛ టిప్పర్లకు ఉంది కాబట్టి చక్కగా పనిచేయండి.కెనెరా బ్యాంకు ఆర్దిక చేయూతతో తక్కువ వడ్డీతో ఇచ్చారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.  హైదరాబాద్ కాలనీల్లో చెత్త సేకరణ ఆటోవాలలు బాగా పనిచేయాలి. ఇంట్లనుంచి 50 వసూలు చేయండి..ప్రజలతో సఖ్యతతో వ్యవహరించి తడిపోడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని తెలుపండి నగరాన్ని స్వచ్చల  నగరం గా  మార్చడంలో స్వచ్ఛ సైనికులుగా పనిచేయండి. అందరం కలిసి పనిచేసి దేశంలో హైదరాబాద్ నెంబర్ వన్ సిటిగా చేద్దామని మేయర్ అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18334
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author