మహిళలకు రక్షణ లేకుండా పోయింది

మహిళలకు రక్షణ లేకుండా పోయింది
February 22 16:45 2018
హైదరాబాద్,
తెలంగాణలో మానవహక్కుల ఉల్లంఘన యధేచ్చగా కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రజలు తెరాస  ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతిరేకంగా వున్నారని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు అయన కాంగ్రెస్ పేవాదళ్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇతర పార్టీల నేతలను కొనుగోలు మినహా  తెరాస  ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది ఏమీలేదు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మహిళలు లేని మంత్రివర్గం… దేశంలో కేవలం తెలంగాణలోనే వుందని అయన విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా చైతన్య యాత్ర లో ఎండగడుతా. రైతులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. విద్యార్థులకు,నిరుద్యోగులకు కెసిఆర్ ప్రభుత్వంలో తీవ్రని అన్యాయం జరుగుతోంది. కెసిఆర్ ఫ్యామిలీ మినహా తెలంగాణ ప్రభత్వం లో ఏ ఒక్కరూ భాగుపడలేదని అన్నారు. దళితులకు 3ఎకరాలు,మైనారిటీ లకు 12%రిజర్వేషన్లు,2బెడ్ రూం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితులకు ఇవ్వడానికి భూమి లేకుంటే…దళిత కుటుంబానికి ఎకరానికి 5లక్షల చొప్పున 15లక్షలు చెల్లించాలి. అసెంబ్లీలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా జనాభా ప్రాతిపదికన బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18353
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author