అనంతకు కియో ఒక వరం : సీఎం చంద్రబాబు

అనంతకు కియో ఒక వరం : సీఎం చంద్రబాబు
February 22 16:59 2018
అనంతపురం,
పెట్టుబడులకు ఏపీ అనుకూల రాష్ట్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పెనుకొండలో కియా పరిశ్రమలో కార్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అనంత జిల్లా కు “కియో” ఓ వరమని అభివర్ణించారు. ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల పరిశ్రమ గ కియో ఎదగాలి. హైవే దగ్గర్లో ఉండడం కియో కు మరింత సదుపాయలు కలిగాయి. ఒక వైపు హైదరాబాదు.మరో వైపు బెంగళురు అటు వైపు చెన్నై ఇటు వైపు అమరావతి మధ్యలో “కియో” మధ్యలో ఉండడం అభివృధ్ధికి బాసట అని అయన అన్నారు. కియో రాకతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎక్కువ అయ్యాయి. నిరుద్యోగులు అనే వారే ఉండరు. కియో రాకతో మరో 24 అను బంధ సంస్థలు రానుండడం శుభ పరిమాణమని అన్నారు.
వ్యాపార అనుకూల ప్రాంతాల్లో ఏపీ ముందుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా మంది ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. మూడున్నరేళ్లలో 1,946 ఎంవోయూలు కుదుర్చుకున్నామన్నారు. భవిష్యత్తులో 32 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖలో మూడోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహించబోతున్నామన్నారు.కొరియా దేశం మా దేశం లో దేశం లో ఎక్కడ కాకుందా ఆంధ్రప్రదేశ్ లోనే “కియో” కార్ల పరిశ్రమ పెట్టడానికి సహకరించిన కియో ఎండి కి ధన్యవాదాలని సీఎం అన్నారు.
కియా మోటార్స్ సంస్థ అధ్యక్షుడు పార్క్ మాట్లాడుతూ 2021 సంవత్సరం నాటికి 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కియా మోటార్స్ సోదర సంస్థ ముందాయ్ ప్లాంట్ 1996లో చెన్నైలో ఏర్పాటైందని, ఇప్పుడు ఏపీలో కియా మోటార్స్ ఏర్పాటవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 10వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కియా మోటార్స్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతామన్నారు. కియా మోటార్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరవలేనిదని ఈ సందర్భంగా కియా అధ్యక్షుడు పార్క్ పేర్కొన్నారు. ప్రజలు, అధికారులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18360
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author