నాడు వాయు సేన‌లో…నేడు గేయ ర‌చ‌న‌లో

నాడు వాయు సేన‌లో…నేడు గేయ ర‌చ‌న‌లో
February 22 17:37 2018

సినీ గేయ ర‌చ‌యిత‌గా నేడు రాణిస్తున్న భువ‌న చంద్ర‌…నాడు వాయు సేన ఉద్యోగిగా దేశానికి సేవ‌లందించార‌ని మాజీ సైనికుల సంఘం కొనియాడింది. ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత భువ‌న చంద్ర‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సైనికోద్యోగులు గురువారం విజ‌య‌వాడ‌లో స‌న్మానించారు. మాజీ సైనికుల‌నుద్దేశించి భువ‌న చంద్ర రాసిన ఉద్య‌మ గీతం క‌దిలిరండి…క‌ద‌లి రండి… మాజీ సైనికులారా ఇపుడు సైనిక కుటుంబాల‌నే కాదు అంద‌రినీ అల‌రిస్తోంది. మాజీ సైనికుల పాట‌ను సొంత ఖ‌ర్చుల‌తో రికార్డు చేయించి, అంద‌రికీ సీడీల‌ను అందించిన మాజీ వాయుసేన సంఘ‌ అధ్య‌క్షుడు సి.బి.జి.బాబు భువ‌న చంద్ర గురించి ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. భువ‌న చంద్ర వాయిసేన‌లో ప‌నిచేశార‌ని చాలా మందికి తెలియ‌ద‌ని, ఆయ‌న 1971లో ఇండో- పాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నార‌ని వివ‌రించారు. పంజాబ్ స‌రిహ‌ద్దులో, చెన్న‌య్ లో ఎయిర్ క‌మడోగా  ప‌నిచేసిన భువ‌న చంద్ర ఇపుడు గీత ర‌చ‌న‌లో కూడా రాణిస్తున్నార‌ని కొనియాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ వాయు సేన సంఘం ప్ర‌తినిధులు కాటూరు ర‌వీంద్ర , సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ మైనేని సంప‌త్ కుమార్, అధ్య‌క్షులు ఎ.పి.నాయుడు, గౌర‌వాధ్య‌క్షులు నెప్ప‌ల్లి నాగేశ్వ‌రావు త‌దిత‌రులు భువ‌న చంద్ర గీతాల్లో మాధుర్యాన్ని ప్ర‌శంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫెరడ‌రేష‌న్ క‌మిటీ స‌భ్యులు అన్నె రామ‌కృష్ణ‌, కంచ‌ర్ల ర‌వీంద్ర‌, ప‌ల్లం రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18371
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author