జేపీకి టీడీపీ రాజ్యసభ ఆఫర్

జేపీకి టీడీపీ రాజ్యసభ ఆఫర్
February 23 10:39 2018
హైద్రాబాద్,
లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణకు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వనుందా? త్వరలో ఏపీ అసెంబ్లీ కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో జేపీ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ సమర్థించనుందా? తమకు దక్కే సీట్లు రెండింటిలో ఒకదాన్ని తెలుగుదేశం పార్టీ జేపీకి కేటాయించనుందా? రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు జేపీ. అయితే ఆయన అక్కడ గెలవలేకపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి ప్రత్యక్ష రాజకీయ పోరు నుంచి లోక్ సత్తా తప్పుకుంటుందని జేపీ ప్రకటించారు. అయితే సామాజిక సంస్థగా లోక్ సత్తా కొనసాగుతుందని ప్రకటించారు. ఆ విధంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో సభ్యుడిగా జేపీ మీడియా ముందుకు వచ్చారు. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.ఇంతలోనే.. జేపీకి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీటును ఇవ్వనుందనే ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. తమకు దక్కే రెండు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివిధ సర్వేలు చేయించుకున్నారని, వాటి ప్రకారం జేపీకి అవకాశం ఇవ్వడం మేలని తేలిందని.. దీంతో చంద్రబాబు ఆ మేరకు నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటన ఏదీ చేయలేదు, ఆ పార్టీ నేతలు కూడా ఇంకా స్పందించడం లేదు. లోక్ సత్తా తరఫు నుంచి కూడా ఇందుకు సంబంధించిన స్పందన ఏమీ లేదు. జేపీకి రాజ్యసభ సభ్యత్వం అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18385
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author