995 రూపాయిలకే ….ఎయిర్ టెల్ నయా ఆఫర్

995 రూపాయిలకే ….ఎయిర్ టెల్ నయా ఆఫర్
February 23 11:02 2018
ముంబై,
జియో పోటీని తట్టుకోవడానికి ఇప్పటికీ పలు టెలికాం ఆపరేటర్లు నానా తంటాలు పడుతున్నాయి. జియోకు దీటుగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జియో వల్ల బాగా ప్రభావితమైన ఎయిర్‌టెల్ ఇప్పుడు వరుసబెట్టి ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో విప్లవాత్మక ఆఫర్‌ను తీసుకురాబోతోందని టెలికాం వర్గాల ద్వారా తెలుస్తోంది. రూ.995 ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు ఎయిర్‌టెల్ కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. ఏడాది పాటు ఆ ఆఫర్‌ను ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. 360 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు రోజూ 100 మెసేజ్‌లు, నెలకు 1 జీబీ డేటాను ఆ ప్యాక్‌లో ఎయిర్‌టెల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంతా సక్రమంగానే జరిగితే అతి త్వరలోనే ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోందని టెలికాం వర్గాలు అంటున్నాయి. ఇక, ఇప్పటికే ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఈ ఆఫర్‌ను అందిస్తోంది సంస్థ. సర్కిల్, వినియోగదారులను బట్టి ఆ ప్యాక్ ఆఫర్లు వేర్వేరుగా ఉండబోతున్నాయి. కొన్ని సర్కిళ్లలో ఆ మూడింటిని కలిపి రూ.995 ప్లాన్‌ను అమలు చేస్తున్న ఎయిర్‌టెల్.. మరికొన్ని సర్కిళ్లలో మాత్రం ఎస్‌ఎంఎస్ వెసులుబాటును మాత్రం కల్పించట్లేదు. కాగా, ఇప్పటికే ఎయిర్‌టెల్ అపరిమిత వాయిస్ కాల్స్ ప్లాన్లలో రూ.349, రూ.448 ప్లాన్లను దేశవ్యాప్తంగా వినియోగదారులు భారీగా వాడుతున్నారు. ఇటీవలే రూ.9 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18395
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author