కాంగ్రెస్ యాత్రలో రాములమ్మ, రేవంత్

 కాంగ్రెస్ యాత్రలో రాములమ్మ, రేవంత్
February 23 11:25 2018
హైద్రాబాద్,
కాంగ్రెస్ బస్సు యాత్రకు సిద్దమైంది. ఈనెల 26 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. టీడీపీ నేత రేవంత్ రెడ్డితో పాటు… విజయశాంతిని రంగంలోకి దించనుంది పార్టీ హైకమాండ్. అందుకు సిద్దంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చింది. అందుకే త్వరలో హైదరాబాద్ లోనే కాదు.. తెలంగాణ అంతటా ఆమె రేవంత్ రెడ్డితో పాటు.. బస్సు యాత్రల్లో పాల్గొననుంది. ముందుగా రేవంత్ రెడ్డితో ఆమె మాట్లాడారు. యాత్ర ఎక్కడ ప్రారంభం అవుతోంది. తాను ఏం చేయాలి. ఏం మాట్లాడాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి, కేసీఆర్ తో కలిసి పోరాడారు గతంలో విజయశాంతి. అయినా సరే ఆమెను లెక్కలోకి తీసుకోలేదు కేసీఆర్. పార్టీ అవసరాల కోసం వాడుకుని వదిలేసేలా కేసీఆర్ తీరు ఉందనే విమర్శలు వచ్చాయి. 2009 ఎన్నిక‌ల్లో మెద‌క్ నుంచి ఆమె ఎంపీగా గెలిచి తెలంగాణపై గళం విప్పారు. అటు కేసీఆర్, ఇటు విజయశాంతిలు ఇద్దరు పోరాటం చేశారు. కానీ  కొద్ది రోజుల‌కే ఆమెకు కేసీఆర్‌తో విభేదాలు వచ్చాయి. ఆ పార్టీకి దూర‌మ‌య్యారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి, ప్ర‌స్తుత డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆమె ఈ మధ్య కాలంలో హైకమాండ్ పెద్దలను కలిశారు. అటు సోనియమ్మ, ఇటు రాహుల్ గాంధీలను కలిసి తన వాణి బలంగా వినిపిస్తానని చెప్పారట. ఫలితంగా మరింత క్రియాశీలకం చేసేందుకు వారు సిద్దమవుతున్నారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే బస్సు యాత్ర చేపట్టనున్నారు. 2004లో అధికారమే లక్ష్యంగా వైఎస్సార్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్ ఏయే ప్రాంతాలమీదుగా వెళ్లారో ఇప్పుడు బస్సు యాత్ర కూడా అవే ప్రాంతాల మీదుగా వెళ్లనుంది. ప్రచార బాధ్యతలు ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితోపాటు విజయశాంతికి అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డి, విజయశాంతిలు అయితే తమ ప్రసంగాలతో ఆకట్టుకుంటారని ముక్కుసూటిగా మాట్లాడతారనే వారిని ఎంపిక చేశారంటున్నారు. విజయశాంతికి కూడా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వారు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎంత వరకు అమలు చేస్తారో చూడాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18402
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author