ఘనంగా జేసీ జన్మదిన వేడుకలు

ఘనంగా జేసీ జన్మదిన వేడుకలు
February 23 15:27 2018
హైదరాబాద్,
అనంతపురం ఎంపీ జేసీ  దివాకర్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు శుక్రవారం తాడిపత్రిలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన నివాసంలో స్థానిక టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద జేసీని  కలిసి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  టీడీపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి  జేపీ కేక్ కట్ చేశారు. జేసీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారిలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వీర వీంద్రా రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వెంకటరమణ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రషీద్, పట్టణ టీడీపీ ప్రధానకార్యదర్శి రమేష్ నాయుడు,విజయ్ కుమార్, పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు ఖాదర్, పట్టణ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు కరీముల్లా ఖాద్రి, ప్రధానకార్యదర్శి హాజి బాష, కార్యనిర్వాహక కార్యదర్శి ఫారూఖ్, శ్రీనివాసులు, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18434
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author