జీడిమెట్ల లో అగ్నిప్రమాదం..

జీడిమెట్ల లో అగ్నిప్రమాదం..
February 23 15:31 2018
హైదరాబాద్,
జీడిమెట్ల పారిశ్రామికవాడ సుభాష్నగర్లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజయశ్రీ కెమికల్స్లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.  ఈ ప్రమాదంలో పరిశ్రమలో పనిచేస్తున్న 8 మంది కార్మికులకు గాయలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టూ ఉన్న ఇతర పరిశ్రమల యజమానులు, చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. దాదాపు కిలోమీటరు వరకూ నల్లటి పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కెమికల్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న గోదాములోనికి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల దుకాణాలు, ఫ్యాక్టరీల వారు, జనం మరింత భయాందోళనలు వ్యక్తం చేసారు. ఘటనలో గాయాలపాలయిన సింహాచలం . కుమారస్వామి . శ్రీనివాస్ . సందీప్ కుమార్ . నరహరి సత్య.  హరన్ కలహరిలని కొంపల్లి లోని హర్ష హస్పిటల్ కు తరలించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18437
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author