తెలంగాణ సర్కార్ కు ఊరట

తెలంగాణ సర్కార్ కు ఊరట
February 23 15:36 2018
న్యూఢిల్లీ,
కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో సాగునీరు, తాగునీరు అందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణ సందర్భంగా మంత్రి హరీశ్రావు సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. తీర్పు అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను సుప్రీం కోర్టు కొట్టివేసిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ రైతాంగం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసిందని, దాదాపు 100 కేసులు వేసిందని అన్నారు. ఈ కేసులు వేయించిన నాయకుడి పేరు త్వరలో బైటపెడతానని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ రైతాంగం, ధర్మం, న్యాయం గెలిచాయని ఆయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18443
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author