రూ. 19.50 కోట్లతో బుడమేరుపై  3 బ్రిడ్జిల  నిర్మాణం 

రూ. 19.50 కోట్లతో బుడమేరుపై  3 బ్రిడ్జిల  నిర్మాణం 
February 24 13:27 2018
జి.కొండూరు,
నియోజకవర్గంలో బుడమేరుపై 3 వంతెనలు ఒక్కొక్కటి సుమారు రూ.6.50 కోట్లతో నిర్మాణాలు మరియు శాంతినగర్ ఈలప్రోలు గ్రామాల మధ్య రూ. 2.50 కోట్లతో సూపర్ పాసేజ్ వెరసి రూ. 22 కోట్లతో చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాడు సాయంత్రం మండలంలోని కట్టుబడిపాలెం, కవులూరు గ్రామాల్లో సుమారు 103 ఇళ్ల పట్టాలను మంత్రి ఉమా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాలలో భాగంగా సుమారు 3 లక్షల ఇండ్లకు శంకుస్థాపన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నట్లు మంత్రి వివరించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టా రూ. 4 నుండి 5 లక్షల విలువైనదిగా సుమారు 103 మందికి రెండు గ్రామాల్లో  అందజేస్తున్నట్లు తెలిపారు. 4 లక్షల మంది మహిళలను గుర్తించి మీకు ఉద్యోగాలు ఇచ్చారని, 23వ తేదీ ముఖ్యమంత్రి స్వయంగా సాధికార మిత్రలతో మాట్లాడనున్నారని అన్నారు.  జీవో నెంబర్ 388 తో రాష్ట్రంలో 1 లక్ష పట్టాలు, జిల్లాలో 60 వేల పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు చేసి పెడతానని, నాయకులు, ప్రజాప్రతినిధులు పేదవాళ్లకు పని చేయండని సూచించారు. గ్రామాల్లో ఇన్ని సీసీ రోడ్లు ఏనాడైనా చూసారా అని ప్రజలను మంత్రి ఉమా అడిగారు. మా పెళ్లిళ్లు 2019 మార్చిలో… ఉన్నాయని ఇప్పుడేమి లేవని గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు చెప్పేందుకే వచ్చానని పేర్కొన్నారు.
రూ. 17.50 లక్షలతో కవులూరు ప్రాధమిక సహకార పరపతి సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం
కవులూరు : కవులూరులో నూతనంగా నిర్మించిన పి.ఏ.సి.ఎస్. భవసనమును శుక్రవారం సాయంత్రం ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. రూ. 8 లక్షలతో ప్రహరీ నిర్మాణం కూడా చేయనున్నట్లు తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18553
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author