ఈ పాస్ తో రేషన్ అక్రమాలకు చెక్ 

 ఈ పాస్ తో రేషన్ అక్రమాలకు చెక్ 
February 24 15:07 2018
మహబూబ్ నగర్,
రేషన్ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏప్రిల్ నుంచి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పాస్) విధానం అమలు చేయనున్నారు.  జిల్లాలోని 14 మండలాల పరిధిలో 403 రేషన్ దుకాణాలు ఉండగా, లక్షా 98 వేల 895 ఆహార భద్రతా కార్డులు, 12233 ఎఫ్‌ఎస్‌సి కార్డులు, 180 అన్నపూర్ణ కార్డులు ఉన్నట్టు ఆయన వివరించారు. పౌరసరఫరాల శాఖ నుంచి వస్తున్న సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ-పాస్ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ఈ విధానం అమలు కోసం సన్నాహాలు ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డులో పేరు గల వారిలో ఒకరు రేషన్ దుకాణంకు వెళ్లి తమకు కావాల్సిన సరుకులు ఎలక్ట్రానిక్ మిషన్‌లో వేలు ముద్ర వేసి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విధానం వల్ల కార్డు కలిగిన వారు, అవసరం ఉన్న వారు మాత్రమే రేషన్ దుకాణం వెళ్లి సరుకులు తీసుకెళ్తారని ఆయన తెలిపారు. ఈ విధానం వల్ల రేషన్ డీ లర్ కూడా ఎలాంటి అక్రమాలకు పాల్పడటానికి వీలు ఉండదన్నారు. ఇటీవలి కాలంలో రేషన్ బియ్యం, కిరోసిన్ పెద్దఎత్తున అక్రమంగా బ్లాక్ మా ర్కె ట్‌కు తరులుతున్న నేపథ్యంలో ప్రభు త్వం దీనికి తగిన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18565
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author