వచ్చే ఏడాది నుంచి బయో మెట్రిక్ 

వచ్చే ఏడాది నుంచి బయో మెట్రిక్ 
February 24 15:12 2018
నల్లగొండ,
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అమలు చేస్తున్న బయోమెట్రిక్ సత్ఫాలితాలు ఇస్తోంది. గతంలో తరగతి గదుల్లో కనీసం 25శాతం విద్యార్థుల హాజరులేకుండా ఉండే తరగతులు ప్రస్తు తం 95శాతంతో దర్శనమిస్తున్నాయి. మరో వైపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కంటే ఎంజీయూలోనే విద్యార్థులకు బయోమెట్రిక్ అమలు చేస్తూ ప్రథమ స్థానంలో నిలుస్తోందని యూనివర్సిటీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్యాంప్ కళాశాలలోని వివిధ కోర్సుల్లో (ఫీజీ, ఎంబీఏ, ఇంజనీరింగ్)లో 1,875మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత వీసీల కాలంలో విద్యార్థులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తుండటంతోపాటు తరగతులకు సక్రమంగా హాజరుకావడంలేని తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరును అమలు చేసింది. దీని ప్రకారం ప్రతీ విద్యార్థ్ధి ప్రతి సెమిస్టర్‌లో 75శాతం హాజరు ఉంటేనే ఇంటర్నల్, ఎక్స్‌ట్రనల్ పరీక్షలకు అనుమతి ఇస్తామని వీసీ, రిజిస్ట్రార్‌తోపాటు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ సూచించారు. అయితే హాజరులేని వారిని పరీక్షలు రాయనివ్వలేదు. హాజరు విధానం సడలించాలని విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక నిత్యం తరగతులకు హాజరవుతుండటంతో తరగతి గదులు కళకళాడుతున్నాయి. 90నుంచి 95శాతం విద్యార్థులు ప్రతీ తరగతి గదిలో పాఠాలు వింటుండం విశేషం.యూనివర్సిటీ కళాశాల హాస్టల్స్ ఉండే విద్యార్థులు తరగతులకు రాకుండా ఉంటే హాస్టల్ అడ్మిషన్ రద్దు చేస్తామని వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలు జారీచేశారు. అయితే దీనికి తోడు కళాశాలల పని వేళల్లో హాస్టల్స్‌లో ఆకస్మిక తనిఖీ చేపడటంతోపాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో హాజరు శాతం పెరగడంతోపాటు, ఫలితాల శాతం కూడా పెరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఎంజీయూ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలోని అన్ని అనుబంధ ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో కూడా వీసీ  ఆదేశాలమేరకు బయోమెట్రిక్ అమలు చేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. తొలుత సాధ్యం కాదన్న యూనివర్సిటీ కళాశాలల్లోనే విద్యార్థుల హాజరు 95శాతం చూపిం చాం. మా ఇల్లు చక్కదిద్ధాం… దీంతో మిగిలిన కళాశాలు ఎలా చేయాల్లో చేసి చూపిస్తామని…. విధిగా అన్ని కళాశాలల్లో 95శాతం హాజరు లేకుంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని. దీనికితోడు ప్రభుత్వం అందజేసే ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు నిలిపివేస్తామన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18567
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author