వ్యక్తిగత విమర్శలు వద్దు

 వ్యక్తిగత విమర్శలు వద్దు
February 25 12:03 2018
 అమరావతి,
శనివారం నాడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి.. నేతలు అనురించాల్సిన వైఖరిపై దిశా నిర్దేశం చేసారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడైనా.. పోరాటమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని రాజకీయాలకు తావు లేదని అన్నారు. బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దంటూ సూచించారు. ఏపీని ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్రం.. తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం తప్పలేదని అన్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ బీజేపీ ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్ అంశాన్ని నేతలు చంద్రబాబుతో ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాయలసీమకు చేశామనే విషయం ప్రజలకు తెలుసని అయన బదులిచ్చారు. తానూ రాయలసీమ బిడ్డనేననే విషయాన్ని విమర్శలు చేసే వారు గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నడూ కవివినీ ఎరుగని రీతిలో రాయలసీమకు నీళ్లందించామని  చంద్రబాబు గుర్తు చేసారు. అనంతలో కియా, చిత్తూరులో ఫాక్స్ కాన్ కంపెనీలను ఏర్పాటు చేస్తోంది టీడీపీనేననే విషయం ప్రజలు గుర్తించారని అన్నారు. ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయం నుంచి పక్కదారి పట్టేలా నేతలు వ్యవహరించొద్దంటూ బాబు ఆదేశించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18593
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author