వయోజన విద్య…అంతా మిధ్య

వయోజన విద్య…అంతా మిధ్య
February 26 12:58 2018
నిజామాబాద్,
వయోజన విద్య  అందని పండులా తయారైంది.  ఎక్కడా వయోజన విద్యా కేంద్రాలు లేకపోయిన…. నిధులు మాత్రం..యదేఛ్చగా ఖర్చుఅయిపోతున్నాయి…విడతల వారీగా గ్రామ, మండల సమన్వయకర్తలకు చెల్లించాల్సిన జీతాలు విడుదల చేస్తుంటారు. ఆరు నెలలకోసారి వారి ఖాతాల్లో వీటిని జమచేస్తుంటారు. ఇలాంటి సమయంలో తప్పనిసరిగా ఎంపీడీఓలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాత్రం ఏప్రిల్‌ 2014 నుంచి డిసెంబరు 2016     వరకు ఇలాంటి ప్రక్రియను అసలు పాటించనే లేదు. ఎందుకు దీనిని విస్మరిస్తున్నారనే అంశాన్ని ఉన్నతాధికారులు గుర్తిస్తే ఆదిలోనే ఈ బాగోతం బట్టబయలయ్యేది. వారూ ఈ శాఖను చూసీచూడనట్లుగా వదిలేయడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. లేని వ్యక్తులు ఉన్నట్లుగా చూపి విడతల వారీగా వచ్చిన డబ్బులను మింగేయడానికి ఆస్కారం కల్పించినట్లయింది. రూ.లక్షకు మించిన లావాదేవీల విషయంలోనూ సరిగ్గా ఇదే పరిస్థితి. తమ దృష్టికి రాకుండానే నిధులు విడుదలవుతున్నా ఉన్నతాధికారులు సరైన సమయంలో స్పందించకపోవడంతో తీవ్ర స్థాయిలో నిధులు మళ్లించుకునేందుకు అవకాశం వారికి లభించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎందరు పనిచేస్తున్నారు? ఎన్నిచోట్ల ఖాళీలు ఉన్నాయనే వివరాలను గోప్యంగా ఉంచారు. అసలు ఈ సమాచారాన్ని ఎవరైనా ఉన్నతాధికారులు ఒక్కసారైనా అడిగి ఏమాత్రం విచారణ చేపట్టినా ప్రయోజనం దక్కేది.ప్రస్తుతం కచ్చితంగా ఎంపీడీఓలు అన్ని వివరాలను ధ్రువీకరించిన తర్వాతే వేతనాలు ఇస్తామని జిల్లా అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సమన్వయకర్తలకు సంబంధించి అక్టోబరు 2016 నుంచి సెప్టెంబరు 2017 కాలానికి సంబంధించిన వేతనాలు మంజూరయ్యాయి. ఇందులోనూ అక్టోబరు 2016-మార్చి 17 వరకు ఆరునెలల గౌరవ వేతనాన్ని అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రతి మండలం నుంచి ఎంపీడీఓ ధ్రువీకరిస్తేనే ఆయా ఖాతాల్లో వేతనాలు వేస్తామంటున్నారు. ఎంపీడీఓలు కూడా సరిగ్గా విచారించి పనిచేస్తున్న వారికే వేతనాలు ఇవ్వాల్సిందిగా తమకు పత్రాలు అందించాలంటున్నారు. ఒకవేళ ఈ వ్యవహారంలో ఏవైనా పొరపాట్లు జరిగితే అందుకు వారిదే బాధ్యతని స్పష్టం చేస్తున్నారు. కొందరు గ్రామసమన్వయకర్తలుగా కొనసాగుతున్నా… కనీసం గ్రామాల్లో ఉండటం లేదు. పల్లెకు దూరంగా ఉన్న పట్టణాల్లో ఉంటూ ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు రోజూ రాత్రి గ్రామానికి వచ్చి నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పడం జరగని పని. ఇలాంటి విషయాలనూ పరిగణలోకి తీసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మేలు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18642
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author