రాష్ట్రంలో 22 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములు

రాష్ట్రంలో 22 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములు
February 26 18:17 2018
కరీంనగర్,
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతీ మండలానికి మార్కెటింగ్ గోదాములు, సబ్యార్డులను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు నీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సోమవారం ఇక్కడ రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మినీ మార్కెట్ల ఏర్పాట్ల అంశంపై రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలపై మంత్రి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడినతర్వాత రూ.1000 కోట్లతో దేశంలో ఏ రాష్ట్రం లో జరుగనివిధంగా 18 లక్షల టన్నుల సామర్థ్యం కల్గిన గోదాముల నిర్మాణం పూర్తయిందని, మరో మూడు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం 22లక్షల టన్నుల సామర్థ్యం కల్గిన గోదాములు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని మంత్రి చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో పత్తి ఎక్కువగా పండిస్తున్నా అక్కడ జిన్నింగ్ మిల్లులు తక్కువగా ఉన్నాయన్నారు. వనపర్తిలో వేరుశనగ అధికంగా పండుతుందని, కానీ అక్కడ ఆయిల్ మిల్లులు లేవని చెప్పారు. స్థానికంగా ఏ పంట ఎక్కువగా పండితే దానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. రైతు సమన్వ య సమితి సూచన మేరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. వ్యవసాయాధారిత ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో కొత్తగా 35 మార్కెట్యార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3500 మినీ మార్కెట్ల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించిందని, దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన జరుగుతుంన్నదని తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18695
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author