ఈ-గవర్నెన్స్‌కు తెలంగాణ రాష్ట్రం అత్యధిక ప్రాధాన్యం

ఈ-గవర్నెన్స్‌కు తెలంగాణ రాష్ట్రం అత్యధిక ప్రాధాన్యం
February 26 18:22 2018
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-గవర్నెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు సోమవారం ఉదయం ప్రారంభమైంది. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ-గవర్నెన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ-గవర్నెన్స్‌తో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించొచ్చని స్పష్టం చేశారు. పౌరసేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టీ వ్యాలెట్ ద్వారా సులభమైన పద్ధతిలో లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పౌరసేవల కోసం ఆర్టీఏ ఎం వ్యాలెట్ అందుబాటులోకి తీసుకువచ్చాం.. కొద్ది రోజుల్లోనే1.3 మిలియన్ ప్రజలు ఎం వ్యాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. వ్యాపార అనుకూల రాష్ర్టాల్లో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. టీఎస్ ఐపాస్‌తో 15రోజుల్లోనే నూతన పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని గుర్తు చేశారు. దీని ద్వారా పరిశ్రమలకు అనుమతులను వేగవంతం చేశామన్నారు. ఇంత వేగవంతమైన ప్రక్రియ దేశంలో ఎక్కడా లేదు. పరిశ్రమల అనుమతుల విషయంలో తెలంగాణ ముందంజలో ఉందని స్పష్టం చేశారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ ను అందించబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ తెలంగాణను తయారు చేయడమే ప్రభుత్వ టార్గెట్ అని స్పష్టం చేశారు. 86 సంవత్సరాల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని కేటీఆర్ వెల్లడించారు. భూములన్నింటినీ ఆధార్ నంబర్‌తో అనుసంధానించబోతున్నామని పేర్కొన్నారు. భవన నిర్మాణాల అనుమతల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుందన్నారు. టెక్నాలజీ వాడకం ద్వారా పౌరసరఫరాల శాఖలో వృధాకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. ఈ విధంగా పీడీఎస్ విభాగానికి రూ.200 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18699
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author