మార్చి 25న  సకల జనుల సమ్మె

మార్చి 25న  సకల జనుల సమ్మె
February 27 10:51 2018
హైద్రాబాద్,
తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఉద్యోగవర్గాల నుంచి సెగ ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకలజనుల సమ్మె లాంటిది ఇప్పుడు రాబోతోంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేందుకు పావులు కదిపారు. అయినా సరే ప్రజలు ఆ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లారు. ఇప్పుడు అదే పంథాలో తెలంగాణలో ఉద్యమం జరగనుంది. కాకపోతే ఈసారి కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు జనాలు. మార్చి 25న జరిగే రాష్ట్రవ్యాప్త సమ్మెతో అన్ని రకాల ప్రభుత్వ సర్వీసులూ ఆగిపోనున్నాయి. ఇందులో మూడున్నర లక్షల మంది ఉద్యోగులు, లక్షన్నర మంది పెన్షనర్లు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి.. పాత పద్ధతినే అమలు చేయాలన్నది వీళ్ళ డిమాండ్. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.
అసలే కొత్త పార్టీ హడావుడిలో ఉన్న పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తోపాటు..ప్రజా సంఘాల నేతలు వారికి అండగా ఉంటామని చెప్పారు. ఫలితంగా జరిగే సకల జనులసమ్మె విజయవంతం అయ్యేలా ఉంది. హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో అంతంత మాత్రంగా ఉన్న కేసీఆర్ కు ఈ సమ్మె చుక్కలు చూపించనుంది. విమలక్క, గద్దర్, దేవి వంటి ప్రజా సంఘాల నేతలు వారికి వంత పాడుతున్నారు. అంతే కాదు..కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, వైకాపా నేతలు వారి సమ్మెకు మద్దతు ప్రకటించారు. మరోవైపు సమ్మె జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి చర్చలు జరుగుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18723
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author