శ్రీదేవి లేకపోతే… ఎలా బ్రతకాలి

శ్రీదేవి లేకపోతే… ఎలా బ్రతకాలి
February 27 11:16 2018
 హైద్రాబాద్,
శ్రీదేవిపై ఇదే నా ఆఖరి ట్వీట్.. ఇప్పటి నుంచి తను ఇంకా బ్రతికుందనే ఊహించుకుంటాను.. శ్రీదేవి గారు!! మిమ్మల్ని ఇంత నవ్వించిన తరువాత కూడా మీరు నన్నింతగా ఏడిపించడం అన్యాయం, ఇంకెప్పుడు మీతో మాట్లాడను.. లైఫ్ లాంగ్ కటీఫ్ అంటూ నిన్న ట్వీట్ చేసి వర్మ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు శ్రీదేవి ఎలా చనిపోయింది? శ్రీదేవిది ఆత్మహత్య? ఆమె మరణానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలతో ఆమె మరణం ఓ మిస్టరీగా మారడంతో వర్మ ఈ చర్చను సహించలేకపోతున్నా అంటూ ట్వీట్ చేశారు.నిన్నటి వరకూ శ్రీదేవి అంటే అందం.. అందం అంటే శ్రీదేవిలా మాట్లాడిన వారంతా ఇప్పుడు రకరకాల చర్చలు లేవనెత్తుతున్నారు. ఆమె కళ్లు, ఒళ్లు,పెదాలు గురించి మాట్లాడి ఇప్పుడు ఆమె మృతదేహం, తన రక్తంలో మద్యం, ఊపిరితిత్తుల్లో నీరు, తన కడుపులో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నారు దేవుడా.. ఆమె చనిపోయిన పరిస్థితులపై లేవనెత్తిన చర్చ తనని ఎంతో బాధకి గురి చేస్తోందన్నారు వర్మ.శ్రీదేవి జీవితం ఇంత విషాదంగా ముగుస్తుందని అనుకోలేదు. వాటినే తట్టుకోలేపోతుంటే.. ఇంత కఠినాత్మకమైన మాటలతో ఆమెను విచ్ఛిన్నం చేయడం నన్ను భయానికి గురి చేస్తుంది. మనిషి జీవితం ఇంత దారుణం అని తలుచుకుంటేనే బ్రతికి ఉండటం కంటే నన్ను నేను చంపేసుకుంటే బెటర్ అనిపిస్తుందంటూ శ్రీదేవి మరణంపై వస్తున్న వార్తలపై స్పందించారు వర్మ.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18734
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author