స్కూళ్లలో సెల్ ఫోన్ నిషేధం

స్కూళ్లలో సెల్ ఫోన్ నిషేధం
February 27 12:05 2018
వరంగల్,
పాఠశాల పనివేళల్లో సెల్ ఫోన్ల వినియోగంపై విద్యాశాఖ సీరియస్‌గా ఉంది. పాఠశాల తరగతి గదుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం కన్నా సెల్‌పోన్‌లో మాట్లాడడం, ఆన్‌లైన్ చాటింగ్, సామాజిక మాధ్యమల్లో బిజీగా గడపడంతో విద్యార్థులు నష్టపోతున్నారని గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పాఠశాలల్లో ఫోన్ల వినియోగం జరగరాదని, అలా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 6వ తేదీన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా కస్తర్బాగాంధీ విద్యాలయాల్లో ఈ నిబంధనలను అమలు చేస్తారు. ఆ తరువాత మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విద్యాలయ పరిసరాలలో, తరగతుల్లో ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. కేజీబీవీల్లోని ఉపాధ్యాయలు సిబ్బంది వారి సెల్ ఫోన్లను స్పెషల్ ఆఫీసర్ల వద్ద డిపాజీట్ చేయాల్సి ఉంటుంది. పాఠశాల సమయం ముగిసిన తరువాత తిరిగి సెల్‌ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలల్లో విద్యార్థుల సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధమని, అత్యవసర సమయాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల స్పెషల్ ఆఫీసర్లు ఫోన్ మాట్లాడడానికి అనుమతి ఇస్తూ.. ఫోన్ మాట్లాడిన విద్యార్థి వివరాలను రిజిస్ట్రర్లల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో 15 కస్తూర్బా విద్యాలయాల్లో 2,865 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి కేజీబీవీలో సుమారు 19 వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారందరికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. తదనంతరం ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ సెల్‌ఫోన్ల వాడకాన్ని నిషేధానికి చర్యలు తీసుకోనున్నారు. పాఠశాలల్లో సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించడం ద్వారా విద్యార్థులకు మంచి విద్యాబోధనకు ఆస్కారం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో సెల్‌ఫోన్ల వాడకం జరుగకపోతే తరగతుల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండవని, పనివేళల్లో ఉపాధ్యాయులు ఫోన్లతో బిజీగా ఉండే పరిస్థితి తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. సెల్‌పోన్ల వాడకంపై జిల్లా విద్యాధికారి, నోడల్ ఆఫీసర్, సెక్టోరియల్ అధికారి, మండల విద్యాధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. పాఠశాల ఆవరణలో సెల్‌ఫోన్లు వాడుతున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధ్దం చేసే సమయంలో ఈలాంటి ఉత్తర్వులు రావడంపై ఉపాధ్యాయులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు తీసుకోచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలు శుభపరిమాణమని అంటున్నారు. ఈలాంటి ఉత్తర్వులు వచ్చినా అమలుకు నోచుకోలేక పోయింది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా పకడ్బందీగా అమలు చేయాలనే ధృడ నిశ్చయంతో విద్యాశాఖ ఉంది. ఉత్తర్వులను దిక్కరించి సెల్‌ఫోన్ మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని విద్యాశాఖ హెచ్చరిస్తుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18754
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author