ఏపీలో బాలింతల మదర్ కిట్స్

ఏపీలో బాలింతల మదర్ కిట్స్
February 27 12:33 2018
విజయవాడ,
ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో బాలింతలకు మదర్ కిట్స్‌ను అందచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల తీరు అంతంతమాత్రంగా ఉండటంతో ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు వెనుకంజ వేసేవారు. దీంతో ఇళ్లల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరిగేవి. ఇళ్లల్లో ప్రసవాల వల్ల మాతా, శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందనే విషయాన్ని గమనించి ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వివిధ రకాల నగదు ప్రోత్సహకాలతో పాటు, ఆంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదీ కాకుండా వైద్య సేవల తీరు మెరుగుపడటంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రసవాల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరిగింది. శిశు మరణాలను నివారించే చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ బేబీ కిట్‌ను ప్రభుత్వం అందచేస్తోంది. ఈ కిట్స్‌కు ఆదరణ గణనీయంగా ఉండటంతో బాలింతల కోసం కూడా మదర్స్ కిట్‌ను అందచేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మదర్స్ కిట్‌లో ఒక ఫ్లాస్క్, ఉన్ని రగ్గు/ దుప్పటి, ముఖానికి కట్టుకునేందుకు ఒక గుడ్డ, శానిటరీ నాప్కిన్స్ వంటివి ఉంటాయి. దాదాపు గరిష్ఠంగా 500 రూపాయల విలువైన ఐటెమ్స్‌తో కిట్‌ను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ టి.గీతాప్రసాదిని వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18763
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author