కేంద్రమంత్రి నఖ్వీతో మంత్రి పోచారం భేటీ

కేంద్రమంత్రి నఖ్వీతో మంత్రి పోచారం భేటీ
February 27 15:53 2018
న్యూఢిల్లీ,
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తో  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మంగళవారం నాడు భేటీ అయ్యారు. నిజామాబాద్ – కామారెడ్డి జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన మైనారిటి గురుకుల పాఠశాలలకు మౌళిక వసతులు, ఆర్థిక సాయం అందించాలని కోరారు. తరువాత భేటీ వివరాలను పోచారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో వివరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కోటగిరి, బాన్సువాడ, బీచ్కుంద కామారెడ్డి, లింగంపేట లలోని మైనారిటీ రెసిడెన్షియల్ విధ్యాలయాలలో మౌళిక వసతులు పెంచడానికి నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. బాన్సువాడలో మైనారిటీ బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాల ఉన్నది.     మైనారిటీ బాలికల కోసం ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేయమని విజ్ఞప్తి చేశాం, నఖ్వీ గారు సానుకూలంగా స్పందించారని పోచారం తెలిపారు. మల్టీ సెక్టోరల్ డవలప్ మెంట్ ప్రొగ్రాం క్రింద మైనారిటీ విద్యాసంస్థలలలో మౌళిక వసతుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం. దానికి నఖ్వీ గారు సానుకూలంగా స్పందించారు. అవసరమైన మేరకు సహాయ, సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల విధ్య, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం అని అభినందించారు. 2014 కు ముందు మైనారిటీల కోసం కేవలం 6 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నూతనంగా 206 నెలకొల్పాం. తమ పిల్లలకు అందుతున్న విధ్య, సౌకర్యాలపై మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారికి కలిపి నూతనంగా  మొత్తం 536 రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు ఏర్పాటు చేశాం.  ఈ విద్యాలయాలలో విద్యార్థులకు మంచి విద్యతో పాటు, నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18786
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author