రైతు సంఘాలను రద్దు చేస్తాం : ఉత్తమ్ 

రైతు సంఘాలను రద్దు చేస్తాం : ఉత్తమ్ 
February 28 16:39 2018
సంగారెడ్డి,
ఈసారి ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే నేను రాజకీయల్నుండి తప్పుకుంటా. 06 సీట్లు రాకుంటే కెసిఆర్ రాజకీయల్నుండి తప్పుకుంటాడా అని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.  బుధవారం నాడు సంగారెడ్డిలో అయన కాంగ్రెస్ చైతన్యయాత్రలో ప్రసంగించారు.  2 లక్షలు రుణమాఫీ ఏక కాలంలో చేస్తాం. నాలుగు ఏ ళ్లలో తెరాస, కెసిఆర్ తెలంగాణను భ్రస్టు పట్టించారని అరోపించారు. బంగారు తెలంగాణ కాదు, బంగారు కుటుంబం చేసుకుంటున్నారని విమర్శించారు.  మేం అధికారం లోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. తెరాస పార్టీ రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని అన్నారు. .ఎకరానికి నాలుగు వేలు అనేది ఎన్నికల జిమ్మిక్కు. .కెసిఆర్ ఏమి చేయకుండా గత పాలకులను  నిందిస్తున్నాడు.   ఆరు  శాతం కమిషన్ తో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని అన్నారు. కెసిఆర్ ఒక్క యూనిట్ విద్యుత్ నువ్వు ఉత్పత్తి చేసావానని అయన నిలదీసారు. తెరాస ప్రభుత్వం కేవలం ప్రచారనికే పరిమితం.  అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరు ఎందుకు మార్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను సమీక్షిస్తామని అయన వెల్లడించారు. రైతు సమన్వయ సమితులు తెరాస కమిటీలు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామ ని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18848
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author