ఇసుక లారీలను అడ్డగించిన గ్రామస్తులు

ఇసుక లారీలను అడ్డగించిన గ్రామస్తులు
February 28 18:30 2018
రాజన్న సిరిసిల్ల,
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. తంగళ్ళ పల్లి మండలం చింతల్ తన గ్రామంలో ఇసుక రిచ్ కు ఉదయం నుంచి  సాయంత్రం వరకు ఇసుక తోడే అనుమతి ఉంది. ఈ ఇసుక రిచ్ లో ఉన్న కొంతమంది మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాతో కుమక్కై డబ్బులు దండుకుంటూ ఇష్టారాజ్యంగా  అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అక్రమ ఇసుక లారీలను జిల్లా సరిహద్దు దాటిస్తున్నారు. రాత్రి పూట గ్రామస్తులకు నిద్ర లేకుండా ఇసుక లారీలు నడవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు అనుమతి లేని ఐదు ఇసుక లారీలను అడ్డుకున్నారు. దాంతో కొన్ని లారీలు పరారీ అయ్యాయి. గ్రామస్తులు మైనింగ్ అధికారులకు పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు చేసేది ఏమిలేక లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక మాఫియాతో ఇన్ని ఘటనలు జరిగినప్పటికీ మంత్రి కేటిఆర్ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక మాఫియాను అరికట్టేందుకు మంత్రి కేటిఅర్ దృష్టి పెట్టాలని కోరుతున్నారు..
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18853
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author