సేవ‌తోనే సంతృప్తి  మంత్రి ల‌క్ష్మారెడ్డి 

సేవ‌తోనే సంతృప్తి  మంత్రి ల‌క్ష్మారెడ్డి 
March 01 10:26 2018
జ‌డ్చ‌ర్ల,
సేవ‌లో ఉన్న సంతృప్తి మ‌రెందులోనూ లేద‌ని, ప‌ది మందికి సాయ‌ప‌డ‌టం వ‌ల్ల మ‌న జ‌న్మ‌కు సార్థ‌క‌త ల‌భిస్తుంద‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌తోనే స‌బ్బండ వ‌ర్గాల‌కు స‌మ న్యాయం జ‌రుగుతుంద‌ని మంత్రి చెప్పారు. సిఎన్ఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో…. జ‌డ్చ‌ర్ల‌లోని చంద్ర గార్డెన్స్‌లో జ‌రిగిన టైల‌ర్స్ డే సంద‌ర్భంగా 140 మంది టైల‌ర్ల‌కు ఉచితంగా కుట్టు మిష‌న్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాధార‌ణంగా అంతా సంపాదిస్తార‌ని, ఖ‌ర్చు చేస్తార‌ని, కానీ, అవ‌స‌ర‌మైన వాళ్ళ‌ను ఆదుకోవ‌డం, సేవ చేయ‌డంలో ఉన్న సంతృప్తి మ‌రే వృత్తిలోనూ ల‌భించ‌ద‌న్నారు. అందుకే తాను సేవ‌కు మారు పేరైన రాజ‌కీయాల్లో ఉన్నామ‌న్నారు. రాజ‌కీయాల ద్వారా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ఎక్కువ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. ప‌ద‌వులు వ‌స్తాయి, పోతాయ‌ని, ప‌ద‌విలో ఉన్నంత కాలం ఎంత మేర‌కు ప‌ని చేశామ‌న్న‌దే ప‌ర‌మావ‌ధిగా ఉండాల‌ని మంత్రి చెప్పారు. నిరంత‌రం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన వాళ్ళ‌ని ప్ర‌జ‌లు ఆద‌రించాల‌ని చెప్పారు.
కుల వృత్తులు అడుగంటుతున్న త‌రుణంలో తెలంగాణ సీఎం నేనున్నానంటూ, ఆయా వృత్తుల వారిని ఆదుకుంటూ గొర్రెలు, చేప‌ల పెంప‌కం, చేనేత‌ల‌కు చేయూత‌, రైతాంగానికి పంట పెట్టుబ‌డులు అందిస్తున్నారు. అలాగే మిగ‌తా చేతి వృత్తుల వాళ్ళంద‌రినీ ఆదుకోవ‌డానికి సీఎం అనేక ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నార‌న్నారు. స‌బ్బండ వ‌ర్గాల‌కు కెసిఆర్ హ‌యాంలోనే స‌మ న్యాయం జ‌రుగుతుంద‌ని మంత్రి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాల‌కు మారుపేరుగా సీఎం కెసిఆర్ మారార‌న్నారు. అందుకే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్న‌ద‌న్నారు. తెలంగాణ సాధ‌కుడు, బంగారు తెలంగాణ ఆవిష్క‌ర్త‌ కెసిఆర్‌కి ప్ర‌జ‌లు అండ‌గా ఉండాల‌ని మంత్రి కోరారు.
అదే స్ఫూర్తితో సేవే ల‌క్ష్యంగా…ఆప‌న్నుల‌ను ఆదుకోవడ‌మే ప‌ర‌మావ‌ధిగా సిఎన్ఆర్ ఫౌండేష‌న్ ఆవిర్భ‌వించింద‌న్నారు. త‌న‌ తండ్రి కీ.శే. చ‌ర్ల‌కోల నారాయ‌ణ‌రెడ్డి, సోద‌రుడు కీ.శే. చ‌ర్ల‌కోల న‌ర్సింహారెడ్డిల పేర్ల మీద త‌మ కుటుంబ సభ్యులు ఈ ఫౌండేష‌న్‌ను 2016 ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన ప్రారంభించారన్నారు. అప్ప‌టి నుండి అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారని, 500 మంది గ్రూప్‌-2 అభ్య‌ర్థుల కోసం 45 రోజుల పాటు ఉచిత శిక్ష‌ణ  కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించారన్నారు. వృత్తి నైపుణ్య శిక్ష‌ణ కూడా ఇప్పించారని, నీటికి అల్లాడుతున్న కొన్ని గ్రామాల‌కు ఆర్ ఓ ఆర్ మంచినీటి ప్లాంట్ల‌ని ఏర్పాటు చేశారని చెప్పారు. నిరుద్యోగ యువ‌త కోసం ఉచిత‌ ఉపాధి శిక్ష‌ణ‌ కార్య‌క్ర‌మాలు-జాబ్ మేళాలు నిర్వ‌హించారన్నారు. ఇవేగాక వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వ‌హిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లకు వైద్యాన్ని చేరువ చేశారని, గ్రామీణ మ‌హిళ‌ల కోసం ఉచిత బ్రెస్ట్ క్యాన్స‌ర్ స్క్రీనింగ్ చేప‌ట్టారని, ఇందులో కొందిరికి ప‌లు స‌మ‌స్య‌లున్న‌ట్లు తేల‌డంతో వాళ్ళ‌కి ఉచితంగా చికిత్స‌లు కూడా చేయించారని వివ‌రించారు. ఉచిత కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారని, మందులు, అద్దాలు ఇప్పించారని, అవ‌స‌ర‌మైన వాళ్ళ‌కు కంటి శ‌స్త్ర చికిత్స‌లు చేయించారని, ఇలా విద్యా, వైద్య‌, ఉపాధి, ఉద్యోగ శిక్ష‌ణ రంగాల్లో సేవ‌లు నిర్వ‌హిస్తూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాభిమానాన్ని సిఎన్ఆర్ ఫౌండేష‌న్‌ చూర‌గొంటున్న‌దని మంత్రి చెప్పారు. సిఎన్ఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో తాజాగా జ‌డ్చ‌ర్ల‌లోని నిరు పేద‌లు, రెక్కాడితేకానీ డొక్కాడ‌ని టైల‌ర్ల‌కు ఉచితంగా అధునాత‌న హై ఎండ్ కుట్టుమిష‌న్ల‌ను పంపిణీ చేశామ‌ని, త్వ‌ర‌లోనే అర్హ‌త క‌లిగిన మ‌హిళ‌ల‌కు కూడా ఇలాంటి కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేస్తామ‌ని మంత్రి తెలిపారు.
ఈ కార్య‌క్‌మంలో జెడ్పీటీసీ, ఎంపిపి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, స్థానిక టైల‌ర్స్ అసోసియేష‌న్ స‌భ్యులు, ల‌బ్ధిదారులు, సిఎన్ఆర్ ఫౌండేష‌న్ స‌భ్యులు, శివ‌కుమార్‌, కోడుగ‌ల్ యాద‌య్య  త‌దిత‌రులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18870
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author