భారీ ఎన్ కౌంటర్ లో పన్నెండుమంది మావోయిస్టులు మృతి

 భారీ ఎన్ కౌంటర్ లో పన్నెండుమంది మావోయిస్టులు మృతి
March 02 11:48 2018
భద్రాచలం,
 తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు నేతలు బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సిఉంది. ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. చర్ల మండలం తొండపాల్  సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్-ఈవోఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టులు చనిపోగా, ఒకరిద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఒక గ్రేహౌండ్స్ జవాను మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి హెలికాప్టర్లు చేరుకున్నాయి.  ఈ ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నట్లు తెలిసింది. సరిహద్దు ప్రాంతమైన తడపల గుట్టలో మావోయిస్టులు మకాం వేశారన్న సమాచారం అందడంతో కూంబింగ్ బలగాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. చాలా రోజుల తర్వాత తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడంతో కలకలం రేగింది. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=18903
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author