ప్రాయశ్చిత్తం చేసుకోవాలి చంద్రబాబుకు కేవీపీ లేఖ

ప్రాయశ్చిత్తం చేసుకోవాలి చంద్రబాబుకు కేవీపీ లేఖ
March 03 17:57 2018
విజయవాడ,
ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, మళ్లీ ప్రజలను మోసం చేయాలని, విభజన హామీలు నెరవేర్చని తప్పు అంతా కేంద్రంపై, బీజేపీపై వేసి ప్రజల సానుభూతి పొందాలని చంద్రబాబు కొత్త అవతారం ఎత్తారని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. శనివారం నాడు అయన పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు పది పేజిల బహిరంగ లేఖ రాసారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి.  “పోలవరంను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి.. దీన్ని కేంద్రమే ఎక్ప్ పీడియంట్ పబ్లిక్ ఇంటరెస్ట్ ప్రాజెక్ట్ గా త్వరితగతిన పూర్తి చేయాలని యూపీఏ ప్రభుత్వం చట్టం చేసింది. 02.03.2014న యూపీఏ కేబినెట్ తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. 01.05.2014 న యూపీఏ కేబినెట్ మీటింగ్ లో పోలవరం పూర్తి ఖర్చును అంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం అదనంగా పడే భారంతో పాటు, ప్రాజెక్ట్ పై కాస్ట్ ఎస్క్ లేషన్స్ సహా ప్రస్తుత రేట్ల ప్రకారం కేంద్రమే భరించాలని తీర్మానించిందని అయన లేఖలో పేర్కోన్నారు.
యూపీఏ కేబినెట్ తీర్మానం ప్రకారం కేవలం పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు చేయగానే.. పోలవరం అంతా కేంద్ర పరిధికిలోకి వెళ్లింది. అయితే, అధికారం లేకపోయినా, జూన్ 2015 లో చంద్రబాబు ప్రాజెక్ట్ నుండి ఇందిరా గాంధీ పేరు తొలగించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పనులు చేపట్టటానికి రాష్ట్రం సహకరించలేదు. కానీ -ఇప్పుడు కాంట్రాక్టర్ల మార్పిడి, పంపకాలలో తేడా వల్ల టీడీపీ- బీజేపీ ఒకరిపైఒకరు నిందలువేసుకోవడం వల్ల వాస్తవాలు బయటకు వచ్చాయని రాసారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పనులు చేపట్టడానికి  రాష్ట్రం ఉదేశపూర్వకంగానే సహకరించలేదు. టీడీపీ గెలుపుకు ఉపయోగపడిన పవన్ ప్రశ్నించడంతో చంద్రబాబు పోలవరం వివరాలు ఆన్  లైన్ కు ఎక్కించాక తప్పలేదని అయన పేర్కోన్నారు. కాంట్రాక్టర్లు తన చేతిలో ఉండాలనే కక్కుర్తితో చంద్రబాబు పోలవరం అథారిటీ కి సహకరించలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుందన బాబు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి ప్రజల పై భారం వేశారని అన్నారు. ఈ  ప్రాజెక్ట్ బాబు చేతులోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకే బాబు శ్వేతపత్రం విడుదల చేయడానికి జంకుతున్నారు. చంద్రబాబు దురాశ ,దుర్బుద్ధి కారణంగానే పోలవరం రెండు సంవత్సరాలు లేట్ అయింది. సీఎం కి రాష్ట్ర ప్రయోజనాలపై పట్టింపు లేదు. వ్యక్తిగత ప్రయోజనాలకోసమైతే ఏదైనా చేస్తారని అయన అన్నారు.  ఇప్పటికైనా స్వార్ధం విడి పోలవరం ప్రాజెక్ట్ కి పెట్టిన ప్రతి పైసా కేంద్రం పై ఒత్తిడి తెచ్చి మీ పాపాలను కొంతమేరకైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కేవీపీ లేఖలో పేర్కోన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19013
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author