మృతి చెందిన  మావోయిస్టుల పేర్లను వెల్లడించిన పోలీసులు

మృతి చెందిన  మావోయిస్టుల పేర్లను వెల్లడించిన పోలీసులు
March 03 18:34 2018
భద్రాద్రి కొత్తగూడెం
నిన్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన 10మంది మావోయిస్టుల పేర్లను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వామి అలియాస్ ప్రభాకర్ ఉండగామిగిలిన9 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. స్వామి అలియాస్ ప్రభాకర్ వరంగల్ జిల్లా హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వాడు. బీఏ బీఎడ్ చదివిన ప్రభాకర్ గత 14 సంవత్సరాలుగా అజ్ఞాతంలో పనిచేస్తున్నాడు. మిగిలిన వారు  ఐతు(తిప్పాపురం), మల్లేశ్(ఇంద్రావతి), బుద్రి(సింగం), రమే(వీరాపురం), కమల పశ్చిమ బస్తర్, కోసి(రంగాయిగూడెం), సుక్కి( గంగ్లూర్), రత్న(బిజాపూర్), సోంబి ఉన్నారు.కాగా చత్తీస్‌ఘడ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో10 మంది నక్సల్స్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనను ఖండిస్తూ సీపీఐ మావోయిస్టులు తాజాగా లేఖను విడుదల చేశారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆ లేఖలో తెలిపారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ ఆ లేఖను విడుదల చేశారు. మృతిచెందిన వారిలో పార్టీ టాప్ క్యాడర్ ఎవరూ లేరన్నారు. ఓ నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ ఘాతుకానికి పాల్పడినట్లు ఆ లేఖలో జగన్ ఆరోపించారు. జిల్లా కమిటీ సభ్యుడు దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రాంపూర్ మండలంకు చెందిన రత్నా అనే నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మిగతా వారంతా సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందినవారన్నారు. తమ దళ సభ్యులు రెస్ట్ తీసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసినట్లు మావోయిస్టులు లేఖలో తెలిపారు. గిరిజనులకు చెందిన సహజసిద్ధ వనరులను ప్రభుత్వాలు అమ్మేస్తున్నాయని ఆరోపించారు. దళితులు, గిరిజనులతో చేతులు కలిపి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ పోలీసులు శుక్రవారం చేసిన ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ మృతిచెందారు. ఆ ఆపరేషన్‌లో ఓ కమాండో ప్రాణాలు కోల్పోయాడు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19048
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author