ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో పూజా హెగ్డే 

ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో పూజా హెగ్డే 
March 05 15:00 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో  కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకం గా రూపుదిద్దుకోబోతోంది.
#NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందించగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించ నున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఏప్రిల్ లో ఈ  చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, వంటి ఘనవిజయం సాధించిన  చిత్రాలను నిర్మించిన విషయం విదితమే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19081
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author