హోర్డింగ్లపై బీజేపీ అభ్యంతరం 

హోర్డింగ్లపై బీజేపీ అభ్యంతరం 
March 05 16:51 2018
అమరావతి,
గవర్నర్ ప్రసంగంలో ఏపీ అభివృద్ధి గురించి చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రేపటి నుంచి అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు. హోదా విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని విష్ణుకుమార్రాజు అన్నారు. అసెంబ్లీలోని బీజేపీ ఎల్పీ హాల్ లో సమావేశమైన బీజేపీ నేతలు మంత్రి మాణిక్యాలరావు , విష్ణుకుమార్రాజు , సోము వీర్రాజు , ఆకుల సత్యనారాయణ , మాధవ్ సోమవారం ఉదయం కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన హోర్డింగుల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. మోడీజీ ఏమిటీ వివక్ష అంటూ హోర్డింగులు ఏర్పాటుకి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని హోర్డింగ్ లో వుండడాన్ని వారు ఆక్షేపించారు. ఇది టీడీపీ ఉద్దేశ్యమా లేక వ్యక్తిగతమా తేల్చాలి. ఈ హోర్డింగులను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని వారన్నారు.
ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ నిన్న టీడీపీ నేత ముళ్ళపూడి రేణుక బీజేపీ నేతలను గుడ్డలూడదీసి కొడతానని వ్యాఖ్యానించారు. టీవీ డిబేట్ లలో ఈ విధంగా ఆమె మాట్లాడాన్ని టీడీపీ ఎలా చూస్తుంది. నిన్న ఆమె గుడ్డలూడదీసి కొడతానంది మరుసటిరోజే మరో టీడీపీ నేత మాకు వ్యతిరెకంగా అసెంబ్లీ వద్ద ఫ్లెక్సీలు కట్టారు. మేము మిత్రపక్షం వున్నాం. మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకి ఫోన్ చేశారని అన్నారు. ఆయనచాలా హుందాగా వ్యవహరించి ఫోన్ చేసి మాట్లాడితే మా పార్టీ బెదిరిపోయిందని అందుకే ఫోన్ చేశారని కొంతమంది కామెంట్ చేస్తున్నారని మాధవ్ వ్యాఖ్యానించారు.
మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ హోదాని ఏ రాష్ట్రానికి పొడిగించలేదు. ఏ రాష్ట్రానికి పొడిగించామో ఆధారాలు చూపాలి. కేవలం ఆన్ గోఇంగ్ ప్రాజెక్టులకి జీఎస్టీ మినహాయింపు మాత్రమె ఇచ్చామని వివరించారు. దాన్నే మీరు ప్రత్యేక హోదా అనుకుంటే పొరబాటు. 🏿ఏపీకి కూడా ఇదే విధంగా జీఎస్టీ మినహాయింపు ఇచ్చే ఆలోచనలో వున్నామని అన్నారు. మా పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాన్ ఇచ్చిన జేఎఫ్సీ నివేదిక పై అధ్యయనం చేయాలని అయన అన్నారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఇలాంటి కమిటీలు చాలా వస్తూ వుంటాయి. గవర్నర్ స్పీచ్ పై మేము రేపు మాట్లాడతామని అన్నారు. నాకు ఎమ్మెల్సీ పదవి మేము ఇచ్చిన భిక్ష అని కొద్దిమంది వ్యాఖ్యానిస్తున్నారు. మా పార్టీ వదిలేయమంటే ఇప్పుడే ఎమ్మెల్సీ పదవి వదిలేస్తానని అన్నారు. ఎవరో రాసిస్తే చదివే వాళ్లు కూడా మా పై విమర్శలు చేస్తున్నారని అయన విమర్శించారు. నేను వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేదని కొంతమంది అంటున్నారు. మరి నాలాంటోడు నలభై ఏళ్ళు ఒక పార్టీలో కొనసాగుతారా అని ప్రశ్నించారు. మాకు ఓటులేదు నోటు లేదు మాకు రాష్ట్రంలో పోయేదేముంది .. ఇక్కడ మాకున్నది కేవలం నాలుగు స్థానాలు అంతే నని వ్యాఖ్యానించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19089
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author