పొంచిఉన్న ముప్పు 

పొంచిఉన్న ముప్పు 
March 06 11:17 2018
కరీంనగర్,
వేసవి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత పెరుగుతుండగా.. అదేస్థాయిలో భూగర్భజలాలు పడిపోతున్నాయి.. ఇళ్లలో బావులు, బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో మానేరు జలాయశమే దిక్కు కాగా.. ఆ జలాయశంలోనూ నీళ్లందే పరిస్థితి లేకుండా పోతోంది.. పంపింగ్‌ చేసుకోవడానికీ ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. మిషన్‌ భగీరథ కింద జలాయశం నుంచి నీటిని తీసుకునేందుకు పైపులైను మార్చడంతో సాంకేతికంగానూ ఇబ్బందులు తలెత్తనున్నాయి.
కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా చేసేందుకు ప్రధాన జలాయశం ఒక్కటే ఆధారం. ఈ జలాయశంలోని నీరు అడుగంటుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దిగువ మానేరు జలాయశం(దిమాజ) నుంచి నీటిని తీసుకొని నీటిశుద్ధి కేంద్రానికి పంపింగ్‌ చేస్తారు. అక్కడ పలు రకాలుగా శుద్ధి చేసి నగరంలోని నీటి నిల్వ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి రోజు విడిచి రోజు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. అయితే దిమాజలో నీటిమట్టం ప్రమాదస్థాయికి పడిపోతోంది. నేరుగా పైపుల ద్వారా నీటిని తీసుకోవడానికి వీల్లేకుండా మారనుంది. అయిదు అడుగులకు పడిపోతే బూస్టర్ల ద్వారా పంపింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
దిగువ మానేరు జలాయశంలో నీటి సామర్థ్యం 920 అడుగులు.. 891అడుగులు(6.35టీఎంసీలు)వరకు ఎలాంటి అంతరాయం లేకుండా నీటిని తీసుకొని శుద్ధి కేంద్రానికి పంపించే వీలుంటుంది. 800 డయా పైపులైను ద్వారా కరీంనగర్‌, సిరిసిల్లకు నీటిని పంపింగ్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా 1200 డయా పైపులైను ద్వారానూ నీటిని బూస్టర్ల ద్వారా తీసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే.. ఏప్రిల్‌ నుంచి బూస్టర్‌ పంపుల ద్వారా నీటిని తీసుకుంటుండగా ఈ సారి నెల రోజుల ముందుగా పంపింగ్‌ చేసుకునే పరిస్థితి నెలకొంటుందనే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం 896 అడుగుల మేర నీరు ఉండగా మరో ఐదు అడుగులకు దిగువకు పడిపోతే బూస్టర్ల ద్వారా నీటిని తీసుకోవాల్సిందే..
దిగువ మానేరు జలాయశం నుంచి రావాటర్‌ తీసుకోవడానికి 800 డయా పైపులైను కనెక్షన్‌ ద్వారా కరీంనగర్‌ నగరానికి, సిరిసిల్ల పట్టణానికి వినియోగించుకుంటున్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా 800 డయా పైపులైన్లు పూర్తిగా తొలగించారు. అదేవిధంగా 1200 డయా పైపులైను ఉండగా.. దాన్ని మిషన్‌ భగీరథ కిందనే వాడుకుంటున్నారు. 600 డయా పైపులైను ద్వారా కరీంనగర్‌, సిరిసిల్లకు రావాటర్‌ ఇచ్చేందుకు కనెక్షన్‌ ఇచ్చారని ఇంజినీర్లు అంటున్నారు. దిమాజ నుంచి నగరానికి వచ్చే తాగునీటి కోసం ఇంటేక్‌వెల్‌ 1200 డయా పైపులైను ఉంది. ఈ పైపులైనుతోనే కరీంనగర్‌, సిరిసిల్లకు తాగునీరు పంపింగ్‌ చేస్తున్నారు. దీనిని సిరిసిల్ల పట్టణానికి తాగునీటిని అందించడానికి 2005లో నిర్మించారు. అప్పటినుంచి అందరికీ ఈ ఇంటెక్‌వెల్‌ ఉపయోగ పడుతోంది. డ్యాంలో నీటినిల్వలు పడిపోతే బూస్టర్ల సహాయంతో నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. దీంతోనే మిషన్‌భగీరథ కోసం వాడేందుకు చర్యలు చేపట్టారు. కొత్తగా ఇంటెక్‌వెల్‌ నిర్మించుకుంటే ఇలాంటి సమస్యలన్నీ దూరమయ్యే అవకాశం ఉంటుంది.
డ్యాం నేరుగా పైపులైన్ల ద్వారా ఫిల్టర్‌బెడ్‌కు రావాటర్‌ తీసుకొని శుద్ధి చేసి నీటిని సరఫరా చేస్తుండగా.. కొద్ది రోజులైతే ఆ నీరు తగ్గనుంది. ఇప్పటికే ఫ్రెషర్‌ రాకపోవడం, సిరిసిల్లకు నీరు వెళ్లకపోవడంతో పంపింగ్‌కు ఇబ్బందులు ఉండటం లేదు. సిరిసిల్లకు కూడా నీటిని తీసుకుంటే రావాటర్‌ అందక ఫిల్టర్స్‌ నిలిపివేసే పరిస్థితి ఉంటుంది. పైపులైన్ల కనెక్షన్లు మార్చడంతో తాగునీటి శుద్ధికి అవస్థలు పడే రోజులు రానున్నాయి. జలాయశంలో ఐదు అడుగుల లోతుల్లోకి నీరు చేరితే ఆశించిన స్థాయిలో రావాటర్‌ రావడం అనుమానంగా ఉంటుంది. పైపులైను సామర్థ్యం తగ్గడం, రోజుకు 58 ఎంఎల్‌డీల నీరు తీసుకొని శుద్ధి చేస్తే తప్ప నగర అవసరాలకు సరిపోవు. అలాంటి పరిస్థితిలో డ్యాం దగ్గర రావాటర్‌ తీసుకునే పైపులైన్లు మార్చడం, తొలగించడం వంటి పనులు చేపట్టడంతో ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19142
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author