ట్రేడ్ లైసెన్స్ల రెన్యువల్ వెంటనే చేయండి

ట్రేడ్ లైసెన్స్ల రెన్యువల్ వెంటనే చేయండి
March 06 15:08 2018
 హైదరాబాద్,
 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రేడ్ లైసెన్స్ లను వెంటనే రెన్యువల్ చేయించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి తెలియజేశారు. 2018 మార్చి 31వ తేదీ అనంతరం రెన్యువల్ చేయించే ట్రేడ్ లైసెన్స్లకు 25శాతం  జరిమానాలను విధించనున్నట్టు స్పష్టం చేశారు. మే 31వ తేదీ అనంతరం రెన్యువల్ చేయించే ట్రేడ్ లైసెన్స్లకు 50 శాతం జరిమానా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికీ ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారస్తులు కొత్తగా ట్రేడ్ లైసెన్స్ పొందడానికి ఆన్ లైన్ద్వారా గాని, ఇ-సేవా-కేంద్రాలు, సిటీజన్ సర్వీస్ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కేంద్ర సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసి ట్రేడ్ లైసెన్స్లు  పొందాలని కమిషనర్ జనార్థన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 కోట్ల ట్రేడ్ లైసెన్స్ ఫీజును వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్థారించుకోగా ఇప్పటి వరకు రూ. 39 కోట్ల ట్రేడ్ లైసెన్స్ ఫీజులను వసూలు చేయడం జరిగిందని తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19179
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author