మండలి లో ముద్దు కృష్ణమనాయుడుకి నివాళి 

మండలి లో ముద్దు కృష్ణమనాయుడుకి నివాళి 
March 06 15:13 2018
అమరావతి,
ఏపీ శాసన మండలిలో మంగళవారం నాడు టీడీపీ సీనియర్ నాయకుడు గాలిముద్దుకృష్ణమ నాయుడికి నివాళి అర్పించారు. ముద్దుకృష్ణమ నాయుడికి శాసన మండలిలో సంతాప తీర్మానం చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ముద్దుకృష్ణమ అని  అన్నారు. ముద్దుకృష్ణమ నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించేవారని గుర్తు చేశారు. దలితతేజం-తెలుగుదేశం కార్యక్రమంలో ముద్దుకృష్న చురకుగా పాల్గొన్నారన్నారు. ముద్దుకృష్ణమ మరణవార్త విని చాలా ఆశ్చర్యపోయానన్నారు. రాజకీయాల్లో ముద్దుకృష్ణమది ప్రత్యేక స్థానం ఉందన్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అందరితో కలిసిపోయేవారని గుర్తు చేశారు. అయన మృతి చాలా బాధాకరమని అన్నారు. శాసన మండలిలో చంద్రబాబు ఎన్టీఆర్ పిలుపు ఇస్తే ముద్దుకృష్ణమ 1982లో పార్టీలో చేరారని గుర్తు చేశారు. ముద్దుకృష్ణమ రాజకీయాల్లోఅంచెలంచెలుగా ఎదిగారన్నారు. ముద్దుకృష్ణమ  ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారని, మూడుసార్లు మంత్రిగా పని చేశారన్నారు. అయన నిరంతరం ప్రజా సేవ కోసం పరితపించేవారని చంద్రబాబు కొనియాడారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19181
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author