గత ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

గత ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
March 06 22:19 2018
అమరావతి
ఆనాటి ప్రధానమంత్రి ఏమైతే హామీ ఇచ్చారో.. ఆ హామీలను నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీకి సంబంధించి రావాల్సిన నిధులు, విభజన హామీలపై నిన్న సాయంత్రం కూర్చుని  మాట్లాడతామని అన్నారని, కానీ చర్చలు సానుకూలంగా జరగలేదని సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. మంగళవారం టీడీపీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు మనకు ఓటేశారని, జవాబుదారీ పాలన ఇవ్వాలని మనల్ని ప్రజలు చట్ట సభలకు పంపారని, బాధ్యతలేని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం, నరేగా నిధులపై ఫిర్యాదులు చేయడం, పోలవరం ప్రాజెక్ట్‌కు అడ్డంకులు సృష్టించడం వంటి పనులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అసెంబ్లీకి సభ్యులంతా హాజరుకావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని, రెండు పార్టీలు కలిసే బిల్లు పాస్‌ చేశాయని కాంగ్రెస్, బీజేపీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. పోలవరానికి ఖర్చు చేసిన32000  కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని,  బడ్జెట్‌లో రాష్ట్ర ప్రస్తావనే లేకపోవడంతో నిలదీశామని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కేంద్రంపై పోరాడుతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హోదా, రాయితీల గురించి మొదటి నుంచి అడుగుతున్నామని, నిన్న జైట్లీతో చర్చలు సానుకూలంగా జరగలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19213
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author